హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
ABN, Publish Date - Feb 21 , 2025 | 02:39 AM
అసెంబ్లీ ఎన్నికలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జరుగనున్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభధ్రులు, ఉపాధ్యా యులు ఓట్లతో బుద్ధి చెప్పాలని రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్య క్షుడు రెడ్డబోయిన గోపి ముదిరాజ్ కోరారు.
సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జరుగనున్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభధ్రులు, ఉపాధ్యా యులు ఓట్లతో బుద్ధి చెప్పాలని రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్య క్షుడు రెడ్డబోయిన గోపి ముదిరాజ్ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని అంకా రపు ఫంక్షన్ హాల్‌లో గురువారం సిరిసిల్ల నియోజకవర్గ స్థాఽయి సమా వేశానికి హాజరైన జిల్లా నూతన అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ముది రాజ్‌తో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియామకమైన మ్యాన రాంప్ర సాద్‌లను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గోపి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికా రంలోకి వస్తే ప్రజలకు ఆరుగ్యారంటీలను అమలు చేయడంతోపాటు యువతను ఆదుకుంటామని హామీలను ఇచ్చి మోసం చేసిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిరుద్యోగులు, యువత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఉద్యోగులకు ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఇవ్వన్ని ఇవ్వడంతోపాటు ఎన్నికల హా మీలను అమలుచేసిన తర్వాతనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విద్యార్థులకు రావాల్సిన రూ 7500 కోట్లను ఇప్పించిన తర్వాతనే ఓట్లను అడుగాలన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటరీ కో-కన్వీనర్ అడెపు రవీందర్, సిరిసిల్ల నియోజకవర్గ కన్వీనర్ కారెడ్ల మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షు డు రాగుల రాజిరెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంక టలక్ష్మీ, నాయకులు గోపాడి సురేందర్‌రావు, వెన్నమనేని శ్రీధర్‌రావు, కంచర్ల పర్శరాములు నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Feb 21 , 2025 | 02:39 AM