కుష్ఠు వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలి
ABN, Publish Date - Jan 29 , 2025 | 01:02 AM
గ్రామాల్లో కుష్ఠు వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజి త అన్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో కుష్ఠు వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజి త అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యంలో కుష్ఠు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రాథమిక ఆ రోగ్య కేంద్ర వైద్యాధికారులు, లెప్రసీ నోడల్ సూపర్‌వైజర్లకు అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి పై అవగాహన పెంచుకోవాలని, వ్యాధిపై ప్రజలో ఉన్న అపోహలను దూరం చే యాలన్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్న సర్వేలో జిల్లాలోని గ్రామగ్రామాన వ్యాధి నివారణ కార్యక్రమాలను వివరిస్తూ అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించాలన్నారు. జిల్లాలోని ప్రతి హైస్కూల్, రెసిడెన్సియల్స్, హాస్టల్స్‌లో విద్యార్థులకు వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. వ్యాధిని ఆరంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ సంపత్, వైద్యులు అనిత, శివరామకృష్ణ, డీపీ ఎమ్‌వోలు చేపూ రి శ్రీనివాస్,కూన సురేష్, ఈదేవి సింగ్, డెమో రాజ్‌కుమార్, హెచ్‌ఈ బాలయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, నోడల్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2025 | 01:03 AM