ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్ని వర్గాల భాగస్వామ్యంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి

ABN, Publish Date - Jan 27 , 2025 | 01:42 AM

అన్ని వర్గాల భాగస్వామ్యంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ఆదివారం జగిత్యాలలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆవిష్కరించారు.

జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ సత్య ప్రసాద్‌

జగిత్యాల, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల భాగస్వామ్యంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ఆదివారం జగిత్యాలలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీస్‌ ఫ్లాగ్‌ మార్చ్‌ను తిలకించి గౌరవ వందానాన్ని స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అర్హత గల మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.64 కోట్లు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. రూ.10 లక్షల విలువ గల ఫిష్‌ మొబైల్‌ వాహనాన్ని పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 258 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాను ప్రగతి వైపు నడిపిస్తూ, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా అభయహస్తం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి రూ. 12 వేల ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన 24,147 మంది ఉపాధిహామీ కూలీలను గుర్తించి గ్రామ సభల ఆమోదం కోసం పంపామన్నారు. రైతు భరోసాలో భాగంగా ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ.12 వేలు చొప్పున అందించనున్నామన్నారు. వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు జిల్లాలో దాదాపు 2.27 లక్షల మంది రైతులకు రూ. 208.93 కోట్లు అందజేస్తామన్నారు.

ఫసంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు

జిల్లాలో 19,974 నూతన రేషన్‌కార్డు దరఖాస్తులను, 49,899 రేషన్‌ కార్డులలో కొత్త వ్యక్తుల పేర్లు నమోదు చేసే ప్రక్రియను నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 2023 డిసెంబరు 9వ తేదీ నుంచి ఇప్పటివరకు 2,75,44,793 మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ కింద సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. రూ.500కే వంట గ్యాస్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,89,725 గ్యాస్‌ కనెక్షన్లకు రూ.500లకే గ్యాస్‌ సిలెండర్‌ సరఫరా చేశామని తెలిపారు. గృహజ్యోతితో పేదల ఇంట విద్యుత్‌ కాంతులు నింపడంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 1,93,686 కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. గడిచిన వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5,580 మంది రైతులు పండించిన 30,626 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని రూ.500 బోనస్‌తో కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో నూతనంగా మంజూరు అయిన కేంద్రీయ విద్యాలయం, జవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు పనులు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, గౌతమ్‌రెడ్డి, ఎస్పీ అశోక్‌ కుమార్‌, జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఫఆకట్టుకున్న డాగ్‌ స్క్వాడ్‌ ప్రదర్శన

గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో పోలీస్‌ స్టాల్‌, డాగ్‌ స్క్వాడ్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. స్టాల్‌లో పోలీస్‌ వ్యవస్థ పనితీరు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన ఆయుధాలు, పోలీస్‌ శాఖ అవలంబిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సైబర్‌ క్రైమ్‌, షీ టీమ్స్‌, ఫ్రింగర్‌ప్రింట్‌, కమ్యూనికేషన్‌, బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌, ఆయుధాల గ్యాలరీపై ఇచ్చిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Updated Date - Jan 27 , 2025 | 01:42 AM