ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కార్యాచరణ

ABN, Publish Date - Mar 08 , 2025 | 12:45 AM

నిరుద్యో గ యువతకు ఉపాధిని కల్పించేలా పక్కా కార్యచరణ ను అమలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు.

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యో గ యువతకు ఉపాధిని కల్పించేలా పక్కా కార్యచరణ ను అమలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి స్కిల్‌ కమిటీ సమా వేశాన్ని సంబంధిత అధికారులతో కలెక్టర్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్‌ చైర్మన్‌గా 16 మంది సభ్యులతో జిల్లా స్థాయి స్కిల్‌ కమిటీని ఏర్పాటుచేశామన్నారు. నిరుద్యోగ యు వతకు ఉపాధి లభించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు జిల్లాస్థాయి స్కిల్‌ కమిటీ పని చేస్తుందన్నారు. జిల్లాలో 20 శాతం జనాభా తయారీ సర్వీస్‌సెక్టార్‌లో ఉపాధి పొందుతున్నారన్నారు. చిన్న పరిశ్రమల స్టాఫర్‌,స్టార్ట్‌ అప్‌కల్చర్‌ స్టాండప్‌ ఇండియా స్టార్ట్‌ అప్‌ ఇండియా వంటి వాటిపై అవగహన కల్పన కార్యక్రమాలను జిల్లా స్థాయిలో స్కిల్‌ కమిటీ ద్వారా చేపట్టాలన్నారు. ఉపాధి అవకాశాలు సృష్టించేలా యు వతను తయారు చేయాలన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, కేంద్ర ప్రభుత్వ రంగం, ఆర్మీ, బ్యాంక్‌ రిక్రూట్‌ మెంట్‌ సంబంధించి వివరాలను యువతకు తెలియజే స్తూ వారు ఉపాధి అవకాశాలు పొందేలా అవసరమైన శిక్షణ అందించేందుకు కార్యాచరణ అమలుచేయాలన్నా రు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, మున్సిపల్‌ భవనంలో ఆర్మీ, నేవీ సంబంధించి ఉద్యోగాలు భర్తీ వివరాలు నో టీసు బోర్డులలో ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలో ఎల క్ట్రిషియన్‌ కొరత కూడా ఉందని ఈ రంగంలో కూడా శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భవ న నిర్మాణ పనులకు సంబంధించి న్యాక్‌ ద్వారా శిక్షణ అందించాలని కోరారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ హర్టికల్చ ర్‌యునివర్సీటీ ద్వారా గార్డెనింగ్‌, హార్టికల్చర్‌లో శిక్షణ అందించాలన్నారు. ప్రధానమంత్రి సూర్యరష్మీయోజన పథకం స్వశఽక్తి మహిళా సంఘాలు, మెప్మా సంఘాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. వీరికి అవసరమైన శిక్షణ తరగతులను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఉపాధికల్పన అధికారి రాఘవేందర్‌, డీఅర్‌డీవో శేషాద్రి, పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు నాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌భేగం, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మల్లిఖార్జున్‌రావు, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు జనార్ధన్‌, రాజమనోహార్‌, కార్మిక శాఖ అధికారి నజీర్‌ మున్సిపల్‌ కమీషనర్‌లు సమ్మయ్య, అన్వేష్‌లు పాల్గొన్నారు.

పెండింగ్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలి

పెండింగ్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను ప్రణాళికాబద్ధంగా ఈనెలాఖరులోపు పరి ష్కరించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎల్‌ ఆర్‌ఎస్‌పై అధికారులతో వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మా ట్లాడుతూ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ 2020 క్రింద 42 వేల 942 దరఖాస్తులు రాగా 23 వేల 515 దరఖాస్తులు ఆమోదించామని, 1230దరఖాస్తులు తిరస్కరించామని అన్నారు. ప్రస్తుతం ఎల్‌1 వద్ద 6776 దరఖాస్తులు, ఎల్‌2 వద్ద 385, ఎల్‌ 3 వద్ద 76 పెండింగ్‌ ఉన్నాయని, వీటిని మార్చి చివరి నాటికి పరిష్కరించాలని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ స్కూట్రినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారులను ఫాలోఅప్‌ చేయాలన్నారు. జిల్లాలో 23 వేల 515 దరఖాస్తులు రుసుం చెల్లింపు కోసం ఆమోదిస్తే ఇప్పటివరకు 184మాత్రమే ఫీజు చెల్లించార ని, మిగిలిన దరఖాస్తుదారులు మార్చి 31లోపు రుసుం చెల్లించి ప్రభుత్వం అందించే 25 శాతం రాయితీ విని యోగించుకునేలా చూడాలని అన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 12:46 AM