ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రయాణికుల భద్రత కోసం ‘అభయ’ యాప్‌

ABN, Publish Date - Jan 23 , 2025 | 12:38 AM

ప్రయాణికుల భ ద్రత, సురక్షిత ప్రయాణం కోస మే అభయ యాప్‌ను అనుసం ధానం చేశామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు.

సిరిసిల్ల క్రైం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల భ ద్రత, సురక్షిత ప్రయాణం కోస మే అభయ యాప్‌ను అనుసం ధానం చేశామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఫేస్‌-2 అభయ యాప్‌ మై ఆటో టాక్సీ సేఫ్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేస్‌-2లో భాగం గా 800 ఆటోలకు క్యూ ఆర్‌ కోడ్‌తో అనుసంధా నం చేశామన్నారు. ప్రయాణికులకు సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం కలిగించాలన్నా రు. ఆటో డ్రైవర్‌లు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ పరిమితిలోపు ప్రయాణికులను ఎక్కించుకోవాల న్నారు. జిల్లాలో మొదటి విడతగా 4వేల వాహ నాలకు అనుసంధానం చేశామన్నారు. అభ య యాప్‌తో వాహనాల డ్రైవర్‌లకు రూ.50 చెల్లిం పుతో యాక్సిడెంటల్‌ డెత్‌కు రూ.లక్ష బీమా సౌక ర్యం కల్పించామన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణంతోపాటు వివిధ ప్రాంతాలకు వేలాది మంది ప్రయాణికులు వస్తారని, వారి రక్షణదృ ష్ట్యా మై ఆటో టాక్సీ సేఫ్‌ను తీసుకొచ్చామ న్నారు. ఆటోలో ప్రయాణి స్తున్న సమయంలో ప్రయాణికులు ఏదైనా సంఘటనలను ఎదు ర్కొన్నపుడు ఆటోకు ముద్రించిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేయా లన్నారు. ఈ స్కాన్‌ ద్వారా వెంటనే డ్రైవర్‌ ఫోటో, వివరాలతో పాటుగా వాహనానికి సంబంధించిన వివరాలు వస్తాయ న్నారు. ఆటో ఎక్కినప్పటి నుంచి దిగే వరకు కమాం డ్‌ కంట్రోల్‌ రూం ద్వారా మానిటర్‌ చేస్తారన్నారు. సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు తీసుకుంటార న్నారు. ఆటోలో ఎక్కిన మహి ళలు ప్రాసింజర్లు ఆటో ఎక్కె ముందు క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవాలన్నారు. ఆటో డ్రైవర్‌లు ఏదైనా నేరాలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్య క్రమాలకు పాల్పడినా సీసీ కెమె రాల ద్వారా క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి తెలుసుకోవచ్చ న్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న పుడు డ్రైవర్‌ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించినా, ర్యాష్‌ డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేసినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆటో డ్రైవర్‌లు ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తూ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకో వద్దనని అన్నారు. అనంతరం ఆటోల డ్రైవర్‌లకు క్యూ ఆర్‌ కోడ్‌ పత్రాలు, ప్రమాద భీమా పత్రా లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి, టౌన్‌ సిఐ కృష్ణ, ట్రాఫిక్‌ ఎస్‌ఐ రాజు, రమేశ్‌, అభయ యాప్‌ సృష్టికర్త అభిచరణ్‌, ఆటో డ్రైవర్‌ లు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2025 | 12:38 AM