ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవ నోటిఫికేషన్‌ !

ABN, Publish Date - Jan 22 , 2025 | 05:38 AM

జేఎన్‌టీయూ 13వ స్నాతకోత్సవానికి వర్సిటీ ఉన్నతాధికారులు ఎట్టకేలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మార్చి మొదటి లేదా రెండో వారంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లను ప్రారంభించారు.

మార్చిలో నిర్వహించాలని నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ 13వ స్నాతకోత్సవానికి వర్సిటీ ఉన్నతాధికారులు ఎట్టకేలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మార్చి మొదటి లేదా రెండో వారంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లను ప్రారంభించారు. 2023-24 విద్యా సంవత్సరంలో జేఎన్‌టీయూ అనుబంధ, అఫిలియేటెడ్‌ కళాశాలల్లో యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన సుమారు 83 వేల మంది విద్యార్థులతో పాటు డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసపీ(పీహెచ్‌డీ) పూర్తిచేసిన సుమారు 120 మంది డిగ్రీ పట్టాల కోసం గత నవంబరు నుంచి ఎదురు చూస్తున్నారు. స్నాతకోత్సవంలో వర్సిటీ చాన్సలర్‌ అయిన రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు ఒరిజినల్‌ డిగ్రీ(ఒడీ)ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం రూ.1000 రుసుం చెల్లించాలని వర్సిటీ అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌లో స్టూడెంట్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను లేదా క్యాంప్‌సలోని పరీక్షల విభాగాన్ని(స్టూడెంట్‌ సెక్షన్‌) సంప్రదించవచ్చన్నారు. కాగా, గౌరవ డాక్టరేట్‌కు గతంలో ఎక్కువగా విద్యావేత్తలు, శాస్త్రవేత్తలనే ఎంపిక చేయగా, ఈ దఫా దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారులు, కళాకారులను ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Updated Date - Jan 22 , 2025 | 05:38 AM