ఆలయ అభివృద్ధిలో అలసత్వం వహిస్తే సహించేది లేదు
ABN, Publish Date - Jan 07 , 2025 | 12:58 AM
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విషయంలో అలసత్వం వహిస్తే సహిం చేది లేదని ధర్మపురి ఎమ్మల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను హెచ్చరించారు.
- ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విషయంలో అలసత్వం వహిస్తే సహిం చేది లేదని ధర్మపురి ఎమ్మల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కోటిలింగాలలో దేవాదాయ, ఇరిగేషన్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆల య అభివృద్ధి, ఇతర అంశాల పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని తగు సూ చనలు చేశారు. ఆలయ అభివృద్ధికి విషయంలో అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించ వద్దని సూచించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. రాబోయే శివరాత్రి వరకు భక్తులకు ఇబ్బంది కలుగకుండా తాగు నీరు, మరుగుదొడ్ల నిర్మాణం వంటివి వెంటనే పూర్తి చేయాలన్నారు. కోటిలింగాలలో పారిశు ధ్యం నిర్వహణకు 2 లక్షల 99 వేల రూపాయల నిధులు మంజూరయ్యాయని, మరో 3 లక్షల రూపాయల అవసరం ఉందని అధికారులు తెలిపారని అవి కూడా మంజూరు చేస్తామని తెలిపారు. మండలానికి సంబంధించిన సాగు నీరు విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వ పాలకులు పట్టించుకోక పోవడం వలన సుమారు రూ.20 వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం లింక్ 2 నిర్మాణం ద్వారా ఇక్కడి నీటిని సిద్దిపేటకు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈసీ సుప్రియ, ఆలయ ఈవో కాంతారెడ్డి, తహశీల్దార్ శేఖర్, ఎంపీవో శ్రీనివాస్, మెఘా కంపెనీ అధికారులు రవి బాబు, శ్రీకాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శైలేంధర్ రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి, రాంమోహన్‌రావు, మురళి, ఉదయ్, సందీప్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు, శ్రీనివాస్, తిరుపతి, రమేష్ పాల్గొన్నారు.
ఫకోటిలింగాల పార్వతీ కోటేశ్వర స్వామికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు నాగరాజు శర్మ, అన్వేష్ శర్మ, కార్తీక్ శర్మలు విప్‌ను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకు లు ఆయనకు స్వామి వారి శేష వస్త్రం కప్పి ఆశీర్వచనాలు అందజేశారు.
ఫవెల్గటూర్ లోని పెద్ద వాగు సమీపంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వం నుండి అనుమ తి వచ్చిన వెంటనే ఆలయ నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు.
Updated Date - Jan 07 , 2025 | 12:58 AM