హర హర మహాదేవ
ABN, Publish Date - Feb 27 , 2025 | 01:26 AM
మహా శివరాత్రి వేడుకలు జిల్లాలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం కోటిలింగాల శ్రీ పార్వ తీ కోటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. పరిసర గ్రామాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వేలా దిగా తరలివచ్చారు.
వెల్గటూర్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి వేడుకలు జిల్లాలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం కోటిలింగాల శ్రీ పార్వ తీ కోటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. పరిసర గ్రామాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వేలా దిగా తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనంకు వేరు వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్ల ద్వారా వెళ్లి స్వామి వారికి అర్చన, అభిషేకాదులు నిర్వహిం చారు. ఆలయ అర్చకులు నాగరాజు శర్మ, సంజీవ్ శర్మలు భక్తులచే ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది కలుగ కుండా ఏర్పాట్లు చేశారు. మహా శివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకొని కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు తెలం గాణ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో సముద్రాల రమేష్ గుప్తా మజ్జిగ పంపిణీ చేశారు. మండలం లోని ముత్తునూర్ ముక్తేశ్వర స్వామి, వెంకటాపూర్‌లోని స్వయంభుః కట్ట రాజేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫ ట్రాఫిక్ సమస్య నివారణకు పటిష్ట చర్యలు
మహాశివ రాత్రి సందర్భంగా కోటిలింగాలకు వాహనాలపై తరలి వచ్చే భక్తులకు ప్రతీ ఏటా ట్రాఫిక్ సమస్య పోలీసులకు ఓ సవాల్‌గా మారేది. భక్తులు వాహనాలపై కిలో మీటర్ దూ రం నుంచే ఇబ్బంది పడేవారు. ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు సీఐరాం నర్సాంహారెడ్డి, ఎస్సై ఉమాసా గర్‌లు పోలీస్ సిబ్బందిని.. ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బోటింగ్ చేయడానికి ఉత్సాహం చూపారు. మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బోటింగ్ సౌకర్యం కల్పించారు.
దుబ్బరాజన్న క్షేత్రంలో
మహాశివరాత్రి వేడుకలు
సారంగాపూర్ : జిల్లాలోనే ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ దుబ్బ రాజన్న ఆల యంలో మహాశివ రాత్రి వేడుకలు అంగ రంగా వైభవంగా జరిగాయి. వేకువ జామునుంచే భక్తులు స్వామి వారి ధర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరా రు. భక్తులు అభిషేకాలు, కుంపటి మొ క్కులు, కోడెలు కట్టి మొక్కులు చెల్లించు కున్నారు. సాయంత్రం వేళలో భక్తులు అధిక సంఖ్యలతో తరలిరావడంతో రాజ న్న క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై దత్తాద్రి ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పా టు చేసి ఉత్సవాలను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బీజేపీ నాయ కురా లు బోగ శ్రావణి దర్శించుకున్నారు.
Updated Date - Feb 27 , 2025 | 01:26 AM