ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN, Publish Date - Feb 14 , 2025 | 11:26 PM

ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని , ఈ క్రమంలో వేసవి కాలంలో ప్రజలకు నిరంతరం శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని , ఈ క్రమంలో వేసవి కాలంలో ప్రజలకు నిరంతరం శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం చెన్నూరు మండలంలోని బతుకమ్మ వాగు సమీపంలోని తాగునీటి ట్యాంక్‌తో పాటు బట్టిగూడ గ్రామంలోని తాగునీటి ట్యాంక్‌ను చెన్నూ రు మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఎ లాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూ పొందించుకుని నిరంతరాయంగా శుద్దమైన తాగునీటిని సరఫరా చే యాలని సూచించారు. పైపులైన్ల మరమ్మత్తులు ఇతర సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. అమృత్‌ 2.0 పథకంలో నిర్మి స్తున్న తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేసి ఈ వేసవిలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:26 PM