ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిబంధనలను పాటిస్తూ వాహనం నడపాలి

ABN, Publish Date - Jan 20 , 2025 | 01:13 AM

నిబంధనలను పాటిస్తూ, వాహనం నడపాలని జగిత్యాల ట్రాఫిక్‌ ఎస్పై మల్లేశం సూచించారు. పట్టణం లోని యావర్‌రోడ్‌ పార్క్‌ సమీపంలో ట్రాలీ ఆటో డ్రైవర్లకు ఆదివారం జాతీ య రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ సేఫ్టీ పై అవగాహన కల్పించారు.

జగిత్యాల ట్రాఫిక్‌ ఎస్సై మల్లేశం

జగిత్యాల అగ్రికల్చర్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): నిబంధనలను పాటిస్తూ, వాహనం నడపాలని జగిత్యాల ట్రాఫిక్‌ ఎస్పై మల్లేశం సూచించారు. పట్టణం లోని యావర్‌రోడ్‌ పార్క్‌ సమీపంలో ట్రాలీ ఆటో డ్రైవర్లకు ఆదివారం జాతీ య రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ సేఫ్టీ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు విధిగా యూనిఫాం ఽధరించాలని, వాహన సంబంధ ఽధృవపత్రాలను అందుబా టులో ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహ నం నడపరాదని సూచించారు. ప్రమాదాల నివారణలో తమవంతు తోడ్పా టును అందించాలని కోరారు. ఈ సందర్భంగా పోస్టర్‌ రిలీజ్‌ చేసి డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్‌ శంకర్‌, హోంగార్డులు లక్ష్మణ్‌, సంతోష్‌, పాషాతో పాటు ట్రాలీ ఆటోల డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 01:13 AM