ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎట్టకేలకు.. -ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం యోచన

ABN, Publish Date - Feb 16 , 2025 | 12:07 AM

భూము లను క్రమబద్ధీకరించేందుకు లే అవుట్‌ రెగ్యులరైజే ష న్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)ను రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్ర భుత్వం తెరపైకి తేవడంతో ప్రజల ధృష్టంతా విధి వి ధానాలపైనే కేంద్రీకృతమై ఉంది.

-నాలుగేళ్ల తరువాత మోక్షం

-వన్‌టైం సెటిల్‌మెంట్‌తో రిజిస్ట్రేషన్లకు సన్నాహాలు

=====================

మంచిర్యాల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): భూము లను క్రమబద్ధీకరించేందుకు లే అవుట్‌ రెగ్యులరైజే ష న్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)ను రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్ర భుత్వం తెరపైకి తేవడంతో ప్రజల ధృష్టంతా విధి వి ధానాలపైనే కేంద్రీకృతమై ఉంది. 2020 సెప్టెంబర్‌ లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు ప్రజలపై మోయలేని భారం మోపిందనే అభిప్రా యాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో సామా న్య ప్రజలు లబోదిబో మంటుండగా, కాంగ్రెస్‌ ప్రభు త్వం వన్‌టైం సెటిల్‌మెంట్‌తో ఎల్‌ఆర్‌ఎస్‌ చేసేందు కు తీసుకున్న నిర్ణయంపట్ల ఆసక్తితో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయ తీల్లో అక్రమ లే అవుట్లు, రిజిస్ట్రేషన్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్‌ 1న బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలి సిందే. ఇందులో భాగంగా 26 ఆగస్టు 2020 లోపు సేల్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసిన లే అవుట్‌ య జమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించినట్లు ప్రకటించింది. అప్పటి ప్రభుత్వం విడు దల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇండ్లు నిర్మించుకొని, ఇంటి పన్నులు చెల్లించి, అనేక పర్యాయాలు క్రయ విక్రయాలు జరిపి ప్రొసీ డింగులు పొందిన స్థిరాస్థులకు సైతం ఎల్‌ఆర్‌ఎస్‌ అ మలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లేని ప క్షంలో అవసరం మీద వాటికి క్రయ విక్రయాలు జ రిపే అవకాశం ఉండదు. ఇలా భూముల రిజి స్ట్రేషన్ల కు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో లంకె పెట్టడంతో సామాన్య ప్రజలు అసహనం వ్యక్తం చే శారు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌.... కొత్తగా లే అవుట్‌ లేని వెంచర్లలోని ప్లాట్లకే వర్తింపజేస్తారా...లేదా అన్ని ప్లా ట్లను క్రమబద్ధీకరించుకోవాలనే నిబంధన విధి స్తా రా...? అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో వడ్డన...

భూముల క్రమబద్ధీకరణ పేరుతో అప్పటి ప్రభు త్వం ప్రజలపై అధిక భారమే మోపేందుకు సిద్ధప డింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం అప్పటికే రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్న భూములకు రెండిం తలు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు 200 చ.గ ప్లాటు 168 చ.మీ.తో సమానం. అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల ప్రకారం 168 చదర పు మీటర్లకు రూ. 400 చొప్పున లెక్కిస్తే రూ. 67,200 చార్జి అవుతోంది. 3000 చ.గజాల లోపు భూ మికి 25 శాతం క్రమబద్ధీకరణ చార్జీలు వసూలు చే స్తుండగా పై ప్లాటుకు (168్ఠ400) రూ. 16,800 ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. సదరు స్థ లం నాన్‌ లే అవుట్‌ గనుక పార్కు స్థలం కింద చూ పనందున అదనంగా ఓపెన్‌ స్పేస్‌ కంట్రిబ్యూషన్‌ చార్జీల కింద ప్లాటు మార్కెటు విలువపై మరో 14 శాతం పన్ను విధిస్తారు. ఈ లెక్కన మార్కెట్‌ విలు వ రూ. 1200 ఉన్న చోట 168 చదరపు గజాల స్థలా నికి రూ. 2 లక్షల 1600 ధర పలుకుతుంది. ఇందు లో 14 శాతం పన్ను కింద రూ. 28,224 వసూలు చే స్తారు. ఇలా ప్లాటు క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ ఎస్‌ కింద రూ. 16,800తోపాటు ఓపెన్‌ స్పేస్‌ కంట్రి బ్యూషన్‌ చార్జీల కింద రూ. 28,224 చెల్లించాలి. అం టే ప్లాటు క్రమబద్దీకరణ అయ్యే సరికి రెండు కలిపి రూ. 45,024 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా దశాబ్దాల కాలం నాటి ప్లాట్లకు సైతం ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చట్టం తెచ్చింది.

చట్టం తెచ్చిన చిక్కులు...

భూముల క్రమబద్ధీకరణకు గాను చట్టంలో అనేక చిక్కులు ఉన్నాయి. లే అవుట్‌ లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఆ చట్టం ప్రకారం తిప్పలు తప్పవు. అనధికార వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లా టును ఆనుకొని ఉన్న రోడ్డు కనీసం 30 ఫీట్ల వెడల్పు ఉండాలి. రోడ్డు తక్కువగా ఉన్న పక్షంలో సదరు ప్లా టు నుంచే రోడ్డుకు సరిపడా స్థలం మినహాయించి, మిగిలిన భూమికే ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపజేస్తారు. అంటే రోడ్డుకు పోను మిగిలిన స్థలం మాత్రమే భూమి య జమానికి దక్కుతుందన్న మాట. కాయ కష్టం చేసి, కూడబెట్టుకున్న డబ్బులతో కొనుగోలు చేసిన ప్లాట్లు కూడా పూర్తిస్థాయిలో దక్కే అవకాశం లేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల తప్పిదం కారణంగా ప్లాట్లు కొను గోలు చేసిన వారు అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు సన్నాహాలు...

అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిం చేందుకు తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ను పకడ్బంధీగా అమ లు చేసే ఆలోచనలో రేవంత్‌ సర్కారు ఉంది. కొన్నిచో ట్ల రిజిస్ట్రార్‌లు లే అవుట్‌లేని స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో ప్రభుత్వాదాయానికి భారీ గండి పడుతోంది. దీన్ని నివారించేందుకు ఏళ్ల తరబ డి పెండింగులో ఉన్న మొత్తం దరఖాస్తులను ఒకేసా రి పరిష్కరించడానికి వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)ను అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా 2020లో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తంలో నుంచి 25 శాతం రాయితీ ఇవ్వడం ద్వారా ఓటీఎస్‌ ఆమలు చేసేందుకు నిర్ణయించింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన వాటికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే అక్రమ రి జిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతుండ గా, తాము ఒక్కో డాక్యుమెంట్‌కు కనీసం రూ. 30వేలు చెల్లించా ల్సి వస్తుందనే భావనలో రియల్టర్లు ఉన్నారు. ఓ వైపు తమ జే బులు ఖాళీ అవుతుండగా, మరోవైపు ఆ సొమ్ము ప్రభుత్వ ఖజా నాకు సైతం చేరడంలేదు. మధ్యలో అధికారుల జేబులు నిండుతు న్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటీఎస్‌ కు అవకాశం కల్పిస్తే ఒక్కో ప్లాటు పై 75 శాతం ప్రభుత్వానికి వెళ్ల నుండగా, తమకూ కొంత మొత్తం కలిసి వస్తుందని రియల్టర్లు భావిస్తున్నారు. తద్వారా వినియోగదారులపైనా భారం తప్పు తుం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పెండింగులో వీఎల్టీ దరఖాస్తులు...

గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించక ముందు ఖాళీ స్థలాలకు ట్యాక్సులు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాలకు మున్సిపల్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్లాట్లకు రిజి స్ట్రేషన్‌ చేయాలంటే వేకెట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (వీఎల్టీ) చెల్లించి అస స్మెంట్‌ సర్టిఫికేట్‌ పొంది ఉండాలన్న నిబంధన విధించారు. దీంతో లే అవుట్‌ లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వీఎల్టీకు పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దర ఖాస్తుదారు డు తన ప్లాటుకు సంబంధించి కనీసం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ట్యాక్సు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క మంచి ర్యాల మున్సిపాలిటీలోనే 600 వీఎల్టీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉ న్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ అంశం తెర పైకి వచ్చినందున వీఎల్టీ అసస్మెంట్‌ దరఖాస్తుల పరిస్థితి ఏంటో అర్థంగాక ప్రజలు తలలు పట్టుకొంటున్నారు. వీఎల్టీ దరఖాస్తులను సైతం పరిగణలోకి తీసుకోవాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.

Updated Date - Feb 16 , 2025 | 12:07 AM