ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో రైతు భరసా

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:29 AM

దేశంలో ఎక్కడా లేని విధం గా రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసిన ఏకైక ప్రబుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, అలాగే త్వరలో రైతు భరోసా కూడా పంపిణీ చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల అర్బన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా లేని విధం గా రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసిన ఏకైక ప్రబుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, అలాగే త్వరలో రైతు భరోసా కూడా పంపిణీ చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల పట్టణంలో 69 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ.18 లక్షల చె క్కులను, 108 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కు లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అ ర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని, అలాగే అర్హు లందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండే లా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌లు మహిపాల్‌ రెడ్డి, సందీప్‌ రావు, తహసీల్దార్‌లు శ్రీనివాస్‌, రామ్మోహన్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొలుగూరి దా మోదర్‌ రావు, నాయకులు నక్కల రవీందర్‌ రెడ్డి, సురేందర్‌ రావు, బాల ముకుందం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన ఎస్‌ఈ

ఇటీవల రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా నియమితు లైన కిషన్‌ రావు శనివారం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అం దజేశారు. అలాగే ఇటీవల మున్సిపల్‌ డీఈగా నియమితులైన రాజేశ్వర్‌ రావు ఎమ్మెల్యేను వారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Updated Date - Jan 19 , 2025 | 01:29 AM