ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drunken Man : నా పెళ్లాన్ని చంపేశా సార్‌!

ABN, Publish Date - Mar 06 , 2025 | 04:53 AM

పోలీసులతోనే త్వరగా కనిపెట్టించాలని ఓ మందుబాబు అతి తెలివి ప్రదర్శించాడు. ఫుల్‌గా మద్యం తాగి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. సార్‌ నా పెళ్లాన్ని కత్తితో పొడిచి చంపేశా.. అంటూ హల్‌చల్‌ చేసి పోలీసులందరినీ పరుగెత్తించాడు. హత్య కేసు అని ఆ వ్యక్తి గ్రామానికి హడావుడిగా వెళ్లిన పోలీసులు.. ఆ భార్య క్షేమంగా ఉండడం చూసి కంగుతిన్నారు.

Hyderabad Police Station
  • అలిగి ఇల్లు వదిలిన భార్యను పోలీసులు కనిపెట్టాలని ఓ మందుబాబు నాటకం

  • సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ ఠాణాలో హల్‌చల్‌

  • ఆమె క్షేమం.. మందుబాబును హెచ్చరించి వదిలేసిన పోలీసులు

కల్హేర్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): తన మీద అలిగి ఇల్లు వదిలి వెళ్లిన భార్యను వెతుక్కునే ఓపిక లేక.. పోలీసులతోనే త్వరగా కనిపెట్టించాలని ఓ మందుబాబు అతి తెలివి ప్రదర్శించాడు. ఫుల్‌గా మద్యం తాగి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. సార్‌ నా పెళ్లాన్ని కత్తితో పొడిచి చంపేశా.. అంటూ హల్‌చల్‌ చేసి పోలీసులందరినీ పరుగెత్తించాడు. హత్య కేసు అని ఆ వ్యక్తి గ్రామానికి హడావుడిగా వెళ్లిన పోలీసులు.. ఆ భార్య క్షేమంగా ఉండడం చూసి కంగుతిన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఈ వింత ఘటన జరిగింది. నిజాంపేట మండల పరిధిలోని కల్వోనికుంట తండాకు చెందిన బద్యానాయక్‌ అనే మందుబాబు పోలీసులను ఇలా బురిడి కొట్టించాడు. అసలేం జరిగిందంటే.. మద్యానికి బానిసైన బద్యానాయక్‌ తన భార్య చాందిబాయితో నిత్యం గొడవలు పడుతుంటాడు. మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి చాందిబాయితో గొడవ పడ్డాడు.

అయితే, బుధవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి చాందిబాయి ఇంట్లో లేకపోవడంతో.. భార్య తనని వదిలి ఎక్కడికో వెళ్లిపోయిందని భయపడ్డ బద్యానాయక్‌ మళ్లీ మద్యం తాగాడు. అదే మత్తులో కల్హేర్‌ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఎస్పై వెంకటేశం ముందు నిలబడి.. తన భార్యను తానే కత్తితో పొడిచి చంపేశానని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కల్వోనికుంట తండాకు చేరుకోగా.. తండాలోని అంగన్‌వాడీ కేంద్రం పక్కన చాందిబాయి నిద్రించి ఉంది. ఆమె క్షేమంగా ఉండడంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు అసలు విషయం గ్రహించి అక్కడి నుంచి వెనుదిరిగారు. తమను ఆటపట్టించిన బద్యానాయక్‌కు బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించి కౌన్సెలింగ్‌ ఇచ్చి హెచ్చరించి పంపేశారు. భార్యను చంపేశానని చెబితే పోలీసులే ఆమెను వెతికి తీసుకువస్తారనే ఆలోచనతో బద్యా ఈ నాటకం ఆడాడని పోలీసులు పోలీసులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2025 | 01:19 PM