ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాదకరంగా ట్రాన్సఫార్మర్లు

ABN, Publish Date - Mar 01 , 2025 | 12:02 AM

రక్షణ లేని ట్రాన్సఫార్మర్లతో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, ఇళ్ల సమీపంలో, రహదారుల వెంట ఏర్పాటు చేసిన ట్రాన్సఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి.

ఫెన్సింగ్‌ కూడా లేని రవీంద్రనగర్‌ రోడ్డులో ట్రాన్సఫార్మర్‌

ప్రమాదకరంగా ట్రాన్సఫార్మర్లు

జనావాసాల మధ్య ఏర్పాటు

రక్షణ చర్యలు చేపట్టని అధికారులు

భయాందోళనలు ప్రజలు

నల్లగొండటౌన, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రక్షణ లేని ట్రాన్సఫార్మర్లతో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, ఇళ్ల సమీపంలో, రహదారుల వెంట ఏర్పాటు చేసిన ట్రాన్సఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. పట్టించుకోవాల్సి న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో ఆయా దారిలో వెళ్లే ప్రజలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా విద్యుత లైనల విస్తర ణ కూడా జరగుతోంది. అయితే తదనుగుణంగా విద్యుత సరఫరాలో ఎ లాంటి అవాంతరాలు తలత్తెకుండా అదనపు ట్రాన్సఫార్మర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇం త వరకు బాగానే ఉన్నా ట్రాన్సఫార్మర్ల ఏర్పాటు చేసే సమయంలో తీసుకోవాల్సిన కనీస నిబంధనలను కాంట్రాక్టర్లు మరిచిపోతున్నారు. పనుల ను పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవరిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

80 వేలకు పైగా విద్యుత కనెక్షన్లు

జిల్లా కేంద్ర పరిధి రోజురోజుకు విస్తరించడం, ఇటీవల నూతన వెంచర్లు ఏర్పాటుతో విద్యుత వినియోగంతోపాటు వినియోగదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. అధికారుల లెక్కల ప్రకారం పట్టణంలో విద్యుత వినియోగదారుల సంఖ్య అన్ని కేటగిరిలు కలిపి సుమారు 90 వేలకు చేరింది. ఇందుకు అనుగుణంగా యాక్షన ప్లానలో భా గంగా విద్యుత లోవోల్టేజీ నివారణకు చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాకుండా అదనపు ట్రాన్సఫార్మర్లను ఏర్పాటు చేశారు. అయితే అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక సెంటర్లలలో రక్షణ లేని ట్రాన్సఫార్మర్లతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొన్ని చోట్ల ఫెన్సింగ్‌ లేక, మరికొన్ని చోట్ల తక్కువ ఎత్తులో ఉండి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పట్టణంలోని రవీంద్రనగర్‌లోని కామేశ్వర్‌రావు కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న ట్రాన్సఫార్మర్‌కు ఎలాంటి ఫెన్సింగ్‌, కంచె లేకపోవడంతో ప్రమాదభరితంగా మారింది. ఆ దారిలో నిత్యం అనేక మం దితో పాటు పాఠశాల విద్యార్థులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అధికారు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఆ కాలనీవాసులు వార్డు కౌన్సిలర్‌ పేరుతో ప్రమాద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా రైల్వేస్టేషనకు వెళ్లే మార్గంలో ఫ్లై ఓవర్‌ కింద ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ట్రాన్సఫార్మర్‌కు ఎలాంటి ఫ్యూజు బాక్సులు లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో పాటు ఇండోర్‌ స్టేడి యం, అంబేడ్కర్‌ ఆడిటోరియం మధ్యలో ఉన్న ట్రాన్సఫార్మ కింద ఉండటం, ఎలాంటి కేబుల్‌ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదకరంగా మారింది. వీటికి తోడు అనేక కాలనీల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సఫార్మర్లకు ఎలాంటి ఫెన్సింగ్‌ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి

రోడ్లు, ఇళ్ల మధ్య ఉన్న ట్రాన్సఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్‌ లేకుంటే కంచె ను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా రోడ్లు వెంట ఉండే వాటికి ఎక్కవగా ప్ర మాదాలు జరిగే అవకాశం ఉంది. అక్కడక్కడా ట్రాన్సపార్మర్లు తక్కువ ఎత్తులో ఉండటం, మరికొన్ని చోట్ల ఫ్యూజ్‌ బాక్సులు లేకపోవడంతో తీ గలను చిన్నారులు పట్టుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మూగ జీవాలు సైతం మేత కు వెళ్లి ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి.

నూల కోటప్ప

తమ దృష్టికి వచ్చాయి

పట్టణంలో అక్కడక్కడా ట్రాన్సపార్మర్లకు ఫెన్సింగ్‌లు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమ దృష్టికి వచ్చింది. అత్యవసరంగా ఉన్న వాటికి సంబంధించి దీనిపై సంబంధిత ఏఈల ద్వారా నివేదికలు తెప్పించుకున్నాం. బడ్జెట్‌ రాగానే వెంటనే పనులు ప్రారంభించి రక్షణ చర్యలు చేపడుతున్నాం. ప్రజలు కూడా ట్రాన్సపార్మర్ల వద్ద చెత్త వేయడం తగదు. డీటీఆర్‌ పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి.

వేణుగోపాలాచార్యులు, ఏడీఈ, నల్లగొండ.

Updated Date - Mar 01 , 2025 | 12:02 AM