ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.40 కోట్లతో గ్రామాల్లో రహదారుల నిర్మాణం

ABN, Publish Date - Jan 20 , 2025 | 01:15 AM

రూ.40 కోట్లతో త్వరలో గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టనున్నామని జగి త్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల అర్బన్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రూ.40 కోట్లతో త్వరలో గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టనున్నామని జగి త్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని 33, 34, 35 వార్డులలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.70 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 34వ వార్డులోని శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ప్రజ్ఞ మున్నూరుకాపు యువజన సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.70 కోట్లతో జగిత్యాల పట్టణంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 20 వేల మంది ప్రజలు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో త్వరలో నివాసం ఉండబోతు న్నారన్నారు. రూ.5 కోట్లతో జగిత్యాలలో ఇందిరా మహిళా శక్తి భవ నం ఏర్పాటు చేశామన్నారు. రైతు బజార్‌లో హోల్‌సేల్‌ మార్కెట్‌ అభివృద్ధి చేశామని, పట్టణంలో 6500 మందికి నూతన రేషన్‌ కా ర్డును మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అడువాల జ్యోతి, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, గుడ్డ జగదీష్‌, రజని, నరేందర్‌, కోసరి అనిల్‌, కూతురు రాజేష్‌, కూతురు పద్మ, బద్దం లత, జగన్‌, గుర్రం రాము, జుంబర్తి రాజ్‌ కుమార్‌, కోరె గంగమ ల్లు, అల్లె గంగసాగర్‌ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర గ్రాడ్యుయేట్స్‌ ఏఈవో అసోసియేషన్‌ ప్రఽధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన సంధ్య సంపత్‌ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలువగా వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 20 , 2025 | 01:15 AM