ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల అభివృద్ధికే కాంగ్రెస్‌ ప్రాధాన్యం

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:48 AM

రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

పెగడపల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న అడ్లూరి

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

పెగడపల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన 93 మందికి మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను, మండల కేంద్రానికి భైర శ్రీనివాస్‌ గల్ఫ్‌లో మృతి చెందగా ఆయన కుటుంబానికి గల్ఫ్‌ బాదిత పథకం కింద రూ. 5 లక్షలు మంజూరు చేసి ప్రొసీడింగ్‌ పత్రాన్ని మృతుని భార్య అంజ మ్మకు బుధవారం ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల పక్షపా తి ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉం టూ ఏదో ఒక ప్రభుత్వ పథకం అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొ న్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, అయినప్పటికి ఎ న్నికలలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన యేడాదిలోపే అన్ని హామీలను అమలు చేస్తూ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు లక్ష్లల లోపు పంట రుణాలున్న రైతులందరికి రూ 21 వేల కోట్లు పంట రుణ మాఫీ చేశామని, ఈ నెల 26 నుండి రైతు బరోసా పథకం అమలు చేయనున్న టు,్ల భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ప్రతి యేటా 12 వేలు అందించనున్నట్లు, అలాగే కొత్త రేషన్‌ కార్డులు అందించనున్నట్లు తెలి పారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది పాలన విజయవంతంపై మం డల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ ర్యాలీలో లక్ష్మ ణ్‌ కుమార్‌ పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ కూడలి లో సీఎం రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్‌, నాయకులు ఒరుగల శ్రీనివాస్‌, విం డో చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, తిరుపతి, మల్లారెడ్డి, శోభారాణి, విజయలక్ష్మి స్వామి, అంజయ్య, భాస్కర్‌, కిషన్‌, కొమురయ్య, ప్రభాకర్‌ రెడ్డి, రమేష్‌ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అనీల్‌, రాజేందర్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీ డీవో శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీవో మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:48 AM