ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress MLC elections: వర్గానికో ఎమ్మెల్సీ సీటు!

ABN, Publish Date - Mar 06 , 2025 | 04:43 AM

అసెంబ్లీ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి పార్టీకి దక్కనున్న నాలుగు సీట్లలో.. ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాలకు ఒకొక్కటి చొప్పున ఇవ్వనుందా? మరో సీటును మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించనుందా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.

ఓసీ, బీసీ, ఎస్సీలకు ఒక్కొక్కటి..

సీపీఐకి ఒక సీటు ఇచ్చే యోచన

రేవంత్‌, మీనాక్షి, భట్టి, మహేశ్‌, ఉత్తమ్‌ల భేటీలో ప్రాథమిక చర్చ

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం!

ఐదుగురినీ సంప్రదించి అభ్యర్థుల్ని ఖరారు చేయనున్న అధిష్ఠానం

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోందా? అసెంబ్లీ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి పార్టీకి దక్కనున్న నాలుగు సీట్లలో.. ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాలకు ఒకొక్కటి చొప్పున ఇవ్వనుందా? మరో సీటును మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించనుందా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రాథమికంగా చర్చించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు సీపీఐకి ఇచ్చిన హామీ మేరకు ఒక సీటును వారికి కేటాయించాల్సి రావచ్చంటూ అధిష్ఠానం నుంచి సంకేతాలు రావడం, ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వీరు భేటీ అయ్యారు. కాగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హోదాలో తొలిసారిగా తన నివాసానికి వచ్చిన మీనాక్షి నటరాజన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కండువా కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. ఎంపికకు నిర్ణయించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు.


ఈ క్రమంలో ఒక సీటును సీపీఐకి కేటాయించాల్సి రావచ్చునన్న అధిష్ఠానం సంకేతాల నేపథ్యంలో మిగిలిన మూడు సీట్ల పంపకం ఎలా జరగాలన్నదానిపై చర్చించారు. ఓసీ, బీసీ, ఎస్సీలకు ఒక్కో సీటు కేటాయించాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే మైనారిటీలకు ఒక సీటు కేటాయించాలన్న అంశంపైనా కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ అంశంపై తుది నిర్ణయానికి రాలేదని సమాచారం.

ఢిల్లీకి పిలిపించి చర్చలు..

శుక్రవారం ఇండియా టుడే ఆధ్వర్యంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. మీనాక్షి నటరాజన్‌, భట్టివిక్రమార్క, మహేశ్‌గౌడ్‌, ఉత్తమ్‌లను కూడా అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులపై తుది చర్చలు జరపనుంది. అయితే ఓసీల నుంచి అనేక పేర్లు వచ్చినా.. తుది చర్చల్లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్‌ నేత కుసుమ్‌కుమార్‌ పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. బీసీల్లో తొలుత అత్యంత వెనుకబడిన వర్గాలకు(ఎంబీసీ) సీటు కేటాయించాలనుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మున్నూరుకాపు సామాజిక వర్గానికి కేటాయుంచే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మున్నూరు కాపుల నుంచి ప్రధానంగా సీనియర్‌ నేత వి.హనుమంతరావు పేరు వినిపిస్తోంది. టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్‌ కూడా తన వంతు ప్రయత్నం చేసుకుంటున్నారు. అయితే బీసీల్లో యాదవ, ఇతర సామాజిక వర్గాల నేతలూ బీసీ కోటాలో సీటు కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఇక ఎస్సీలకు ఒక సీటును మాత్రమే కేటాయించాల్సి వస్తుండడంతో మాదిగ సామాజికవర్గానికి కేటాయించాలా? లేక ఎస్సీ మాలలకు ఇవ్వాలా? అన్నదానిపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయానికి రాలేకపోతున్నారు. శుక్రవారం అధిష్ఠానంతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీలో వీటన్నింటికీ సమాధానం దొరకనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8 లేదా 9న అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2025 | 04:43 AM