City Police : సిటీ పోలీస్ శాఖలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ABN, Publish Date - Jan 08 , 2025 | 04:43 AM
హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్‌పీవో) ఉద్యోగాలకు సిటీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్
హైదరాబాద్ సిటీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్‌పీవో) ఉద్యోగాలకు సిటీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 191 పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు జరపనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు మాజీ సైనికులు, మాజీ పారా మిలటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే ప్రాధాన్యమిస్తామని అధికారులు వెల్లడించారు. జనవరి 1 2025 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మాజీ పారా మిలటరీ, రిటైర్డ్ పోలీసు అధికారులు.. రెండేళ్లలోపు పదవి విరమణ చేసి ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. గరిష్ఠ వయో పరిమితి 61 ఏళ్లని చెప్పారు. నియామకం అయిన ఎస్‌పీవోలకు నెలకు రూ. 26వేలు గౌరవ వేతనం అందజేస్తామని, సెలవులకు అర్హత ఉండదని, సెలవు ది నాలకు జీతం చెల్లించరని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎక్స్ సర్వీ్‌సమెన్ డిశ్చార్జి బుక్/సీఎపీపీ డిశ్చార్జి సర్టిఫికెట్, ఆర్‌పీపీ రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, టెక్నికల్ ట్రేడ్ ప్రొఫీషియన్సీ సర్టిఫికెట్. డ్రైవర్ అభ్యర్థులు చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఎల్‌ఎంవీ/హెచ్‌ఎంవీ, 3 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఎస్‌పీవో ఆఫీస్, సిటీ పోలీస్ కార్ హెడ్ క్వార్టర్స్, పేట్ల బురుజు కార్యాలయంలో జనవరి 25 సాయంత్రం 5 గంటలలోపు నేరుగా సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.
Updated Date - Jan 08 , 2025 | 04:43 AM