ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Central Minister: రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు ఇచ్చాం

ABN, Publish Date - Feb 17 , 2025 | 02:45 AM

మరో రూ.10లక్షల కోట్ల రుణాలను రాష్ట్రానికి ఇప్పించాను. కేంద్ర మంత్రిగా ఏం చేయలేదని చెప్పే వాళ్లు దమ్ముంటే బహిరంగ చర్చ పెట్టండి.. నేను సిద్ధంగా ఉన్నా..’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు.

మరో రూ.10 లక్షల కోట్ల రుణ సాయం

కేంద్ర మంత్రిగా ఏం చేశానో చర్చకు సిద్ధం

నాసిరకం ఉక్కు వల్లే బయ్యారంలో.. ఫ్యాక్టరీ పెట్టలేదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

వరంగల్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి రూ.10లక్షల కోట్లు తీసుకువచ్చాను. మరో రూ.10లక్షల కోట్ల రుణాలను రాష్ట్రానికి ఇప్పించాను. కేంద్ర మంత్రిగా ఏం చేయలేదని చెప్పే వాళ్లు దమ్ముంటే బహిరంగ చర్చ పెట్టండి.. నేను సిద్ధంగా ఉన్నా..’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఆదివారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రూ.7వేల కోట్లతో రామగుండంలో యూరియా ఫ్యాక్టరీని ప్రారంభించాం. రూ.816కోట్లతో కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించాం. రూ.1.35లక్షల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారులను నిర్మించాం. మరో రూ.80వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రూ.7,500కోట్లు వెచ్చించాం. ట్రైబల్‌ వర్సిటీ కోసం 1,000కోట్లు ఇచ్చాం. ఇలా పదేళ్లలో అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు ఇచ్చింది. బయ్యారంలో నాసిరకం ఉక్కు ఉండటం వల్లే ఫ్యాక్టరీ పెట్టలేకపోయాం. కేంద్రం ఫ్యాక్టరీ పెట్టకుంటే తామే.. పెడతామని 2018 ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్‌.. ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలి..?’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


తప్పుల తడకగా కులగణన..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బీజేపీ సమర్థిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో కులగణన చేయలేదని, కులగణన మొత్తం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ సంఘం కూడా కులగణనను సమర్థించటం లేదని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌పై మొదట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో బీసీ గణన పూర్తి చేసి, బీసీ సంఘాలను ఒప్పించి కేంద్రానికి బిల్లు పంపిస్తే, దాని ఆమోదానికి ప్రధానిని ఒప్పిస్తామని తెలిపారు. మోదీ కులంపై మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. ముందు రాహుల్‌గాంధీ కులం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఏడాదిలోనే కాంగ్రె్‌సపై తీవ్ర వ్యతిరేకత..

కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హమీని కూడా పూర్తిగా అమలు చేయటం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, పట్టభద్రులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎ్‌సపైన వచ్చిన వ్యతిరేకత.. 12 నెలల్లోనే కాంగ్రె్‌సపై వచ్చిందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతీవారం ఏదో ఒక సమస్యను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రతీవారం ఢిల్లీకి వెళ్లి హాజరు వేసుకునే సీఎం దేశంలో ఒక్క రేవంత్‌రెడ్డేనని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కిషన్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 17 , 2025 | 02:45 AM