ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు

ABN, Publish Date - Mar 02 , 2025 | 12:41 AM

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు పలుకుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అన్నారు.

మాట్లాడుతున్న రైతు సంఘం నాయకురాలు పశ్య పద్మ

యాదగిరిగుట్ట రూరల్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు వత్తాసు పలుకుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అన్నారు. మండలంలోని ధర్మారెడ్డిగూడెంలో శనివారం జరిగిన రైతు సంఘం జిల్లా మహాసభలో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన నల్లచట్లాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో పాటుగా రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొల్లూరు రాజయ్య, నాయకులు యానాల దామోదర్‌రెడ్డి, సత్యతనారాయణ, బండి జంగమ్మ, ఏశాల అశోక్‌, కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్‌, గోరేటి రాములు, ఎండి. ఇమ్రాన్‌, కల్లెపల్లి మహేందర్‌, పేరబోయిన మహేందర్‌, జక్క దయాకర్‌రెడ్డి, ఎలగందుల అంజయ్య, ఉప్పల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 12:41 AM