ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Funds: రూ.15 వేల కోట్ల నిధుల కోసం కృషి చేయండి

ABN, Publish Date - Feb 08 , 2025 | 03:10 AM

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు వచ్చేలా కృషి చేయాలని తెలంగాణకి చెందిన కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యులకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌లో కేంద్ర పథకాలకు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.5.50 లక్షల కోట్లు రావాల్సి ఉందని, అందులో తెలంగాణకు రావాల్సిన నిధులు రూ.15 వేల కోట్లు ఉన్నాయని ఎంపీలకు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ నిధుల వివరాలపై వారికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

కాంగ్రెస్‌ ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు వచ్చేలా కృషి చేయాలని తెలంగాణకి చెందిన కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యులకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌లో కేంద్ర పథకాలకు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.5.50 లక్షల కోట్లు రావాల్సి ఉందని, అందులో తెలంగాణకు రావాల్సిన నిధులు రూ.15 వేల కోట్లు ఉన్నాయని ఎంపీలకు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ నిధుల వివరాలపై వారికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రధానంగా కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, స్ర్తీ శిశు సంక్షేమ శాఖల నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందని ఎంపీలకు ఉపముఖ్యమంత్రి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ పనులు, నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన బుక్‌లెట్‌లను ఈ సందర్భంగా ఎంపీలకు అందజేశారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామిరెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్‌, సురేష్‌ షెట్కార్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కడియం కావ్యలతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:10 AM