ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు
ABN, Publish Date - Feb 16 , 2025 | 11:39 PM
ఆదివా రం మండలంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన లు చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
- రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కోడేరు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఆదివా రం మండలంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన లు చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల పరిధిలోని కోండ్రావుపల్లి గ్రా మంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రా మంలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాల కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోడేరులో మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల బాలికల పాఠశాలలో 25 లక్షలతో టాయిలెట్, డార్మెటరి హాల్, డైనింగ్ హాల్ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. అదే విధంగా కస్తూర్బా గురుకు ల పాఠశాలలో రూ.10 లక్షలతో అదనపు గదు లను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జనుం పల్లి గ్రామంలో 16 లక్షలతో నిర్మించబోతున్న సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతుల కల్ప నకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చదువు ఒక్కటే విద్యార్థులకు భవిష్యత్తును ఇ స్తుందని, విద్యార్థులు మంచిగా చదువుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె. రామ్మోహన్ రావు, సింగిల్‌విండో డైరెక్టర్ మహే శ్వర్‌రెడ్డి, బావాయిపల్లి మాజీ సర్పంచు నక్క వేణుగోపాల్ యాదవ్, తాజా మాజీ ప్రజాప్రతి నిధులు, కార్యకర్తలు, కురుమయ్య, రాజు, రామ కృష్ణ, కృష్ణయ్య, స్వామి ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 11:39 PM