గొడ్డు కారం ఘటనపై విచారణ జరిపించాలి
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:50 AM
మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని బాలికల వసతిగృహంలో నెలకొన్న గొడ్డుకారంతో అనే సంఘటనపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు.
గొడ్డు కారం ఘటనపై విచారణ జరిపించాలి
ఎంజీయూ వీసీకి బీఆర్‌ఎస్వీ వినతి
నల్లగొండ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని బాలికల వసతిగృహంలో నెలకొన్న గొడ్డుకారంతో అనే సంఘటనపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో వైస్ చానల్సర్ ఖాజా అల్తాఫ్‌హుస్సేనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇలాంటి సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కా కుండా చూడాలని కోరారు. బీఆర్‌ఎస్వీ విద్యార్థులకు అం డగా ఉంటుందని ఏ సమస్య వచ్చిన వీసీతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల క్రాంతి, తేనాలి సైదిరెడ్డి, కత్తుల బంగారు, శంకర్, యుగందర్, సైదులు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 12:50 AM