ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బుద్ధుడు చూపిన శాంతిమార్గంలో నడవాలి

ABN, Publish Date - Mar 04 , 2025 | 12:05 AM

గౌతమ బుద్ధుడు చూపిన శాంతి మార్గంలో నడిచి ప్రశాంత జీవనం గడపాలని ఆల్‌ ఇండియా భిక్కు సంఘం ప్రధాన కార్య దర్శి భదంతే ధమ్మ సారథి సూచించారు.

మాట్లాడుతున్న భదంతే ధమ్మ సారథి

ఆల్‌ ఇండియా భిక్కు సంఘం ప్రధాన కార్య దర్శి భదంతే ధమ్మ సారథి

వాంకిడి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గౌతమ బుద్ధుడు చూపిన శాంతి మార్గంలో నడిచి ప్రశాంత జీవనం గడపాలని ఆల్‌ ఇండియా భిక్కు సంఘం ప్రధాన కార్య దర్శి భదంతే ధమ్మ సారథి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో నిర్వహి స్తున్న బౌద్ద ధమ్మ దీక్షా శ్రామినెర్‌ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుని చిత్రపటానికి, అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. బుద్ధుని బోధనలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరం అన్నారు. బుద్దుడు చూపిన మార్గం నేడు ప్రపంచమంతా ఆచరిస్తున్నారని ప్రజ్ఞా, శీలం, కరుణ అనే అంశాలపైనే మనిషి జీవనశైలి ఆధారపడి ఉంటుంద ని సూచించారు. బౌద్ద ధమ్మ దీక్షను ప్రతీ ఒక్కరు ఆచరించా లని సూచించారు. కార్యక్రమం లో భంతే రాహుల్‌ బోధి, భంతే వివేక్‌, భంతే నిబ్బాన్‌, బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ మహోల్‌ కార్‌, అంబేద్కర్‌ సంఘం నాయ కులు ఉప్రె జైరాం, సునీల్‌కుమా ర్‌, విలాస్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రతాప్‌, దుర్గం సందీప్‌, రోషన్‌, విజయ్‌, విఠ్టల్‌, రమాబాయి మహిళా మండలి సభ్యులు, బౌద్ద ఉపాసకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2025 | 12:05 AM