ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలికలు, మహిళల రక్షణే లక్ష్యం

ABN, Publish Date - Jan 29 , 2025 | 11:49 PM

బాలికలు, మహిళల రక్షణే లక్ష్యమని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ భాస్కర్‌

- మంచిర్యాల డీ సీపీ భాస్కర్‌

మంచిర్యాల క్రైం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి ): బాలికలు, మహిళల రక్షణే లక్ష్యమని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మహిళల కళాశాలల ప్రిన్సిపాల్స్‌, బాలికల పాఠశాల ప్రధానోపాద్యాయులతో, ప్రభుత్వ, ప్రైవేటు బాలికల వసతి గృహాలకు సంబంధించి న బాధ్యులు, వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ హాస్టల్స్‌లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రిసెప్షన్‌ కారిడార్‌ నలువైపులా పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించే విధంగా కెమెరాలను ఏర్పా టు చేయాలన్నారు. హాస్టల్‌లో పనిచే స్తున్న సిబ్బంది పూర్తి సమాచారం యాజమాన్యం వద్ద ఉండాలన్నారు. బాలికల ప్రవర్తన, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ఏమైనా ఇబ్బందు లు ఎదురైనప్పుడు వారి తల్లిదండ్రుల దృష్టికి వెంటనే తీసుకెళ్లాలని సూచించారు. ప్రమాదకర పరిసితులు ఉన్నా, ఎవరైనా హాస్టల్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు, షీటీం ఎస్సై హైమ, తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2025 | 11:49 PM

⚠️ Unable to load news. Check API response or CORS settings.