ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేపటి నుంచి పలు రైళ్లు రద్దు

ABN, Publish Date - Feb 08 , 2025 | 11:07 PM

ఖమ్మం రైల్వేస్టేషన్‌ వద్ద నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల నేపఽథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లుమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

బెల్లంపల్లిలో రైళ్లు రద్దు అయినట్లు ఏర్పాటు చేసిన బోర్డు

బెల్లంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం రైల్వేస్టేషన్‌ వద్ద నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల నేపఽథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లుమధ్య రైల్వే అధికారులు తెలిపారు. కొమురంభీంఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లోని సిర్పూరు కాగజ్‌నగర్‌, రెబ్బెన, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల గుండా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు రద్దయ్యాయి. సికింద్రాబాద్‌ నుంచి సిర్పూరు కాగజ్‌నగర్‌కు (17233) వెళ్లే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 10 నుంచి 20 వరకు, సిర్పూరు కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌(17234) వరకు వెళ్లే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 11 నుంచి 21 వరకు రద్దు అయ్యింది. అలాగే కొచ్చి టూ కోబ్రా ఎక్స్‌ప్రెస్‌ (22648) ఈ నెల 11,14,18 తేదీల్లో రద్దు అయ్యింది. కోట్రా టూ కొచ్చి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22647) ఈ నెల 13,16,20 తేదీల్లో రద్దు అయ్యింది. గోరఖ్‌పూర్‌ నుంచి కొచ్చికి వెళ్లే రఫ్తిసాగర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12511) ఈ నెల 15,17 తేదీల్లో రద్దు అయ్యింది. అలాగే కొచ్చి టూ గోరఖ్‌పూర్‌కు వెళ్లే రఫ్తిసాగర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12512) ఈ నెల 19, 20 తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇండోర్‌ నుంచి కొచ్చికి వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22645) రూటు మళ్లించినట్లు తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 11:07 PM