Kumaram Bheem Asifabad: కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు
ABN, Publish Date - Jan 05 , 2025 | 11:00 PM
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆది వారం డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆది వారం డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిర్యాణి మాజీఎంపీపీ ఆత్రం లక్ష్మణ్, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు తారీక్‌తోపాటు ఆయా మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. అనంతరం ఆసిఫాబాద్ మాజీఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. కేక్ కట్ చేసి ఆయనకు కాంగ్రెస్‌పార్టీ నాయకులు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మసాదే చరణ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, నాయకులు మునీర్, శ్యాం, అసద్, రఫీక్, కలీం, తదిత రులు పాల్గొన్నారు.
జైనూర్: ఆసిఫాబాద్ మాజీఎమ్మెల్యే ఆత్రంసక్కు వర్గీయులు ఆదివారం డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసా ద్‌రావ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మండల పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ముకీద్ తెలిపారు. మండల మాజీ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, పార్టీసీనియర్ నాయకులు మేస్రాం అంబాజీ రావ్, పెందుర్ లచ్చు, పెందుర్ లాల్‌షావ్, మాజీ సర్పం చులు సవిత రాందాస్, గేడాం సత్యభామ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
Updated Date - Jan 05 , 2025 | 11:00 PM