యాసంగి పంట సాగుకు నీరందించాలి
ABN, Publish Date - Mar 04 , 2025 | 12:02 AM
యాసంగిలో ప్రాజెక్టులు, చెరువుల కింద సాగు చేసే పంటలకు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
ఆసిఫాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో ప్రాజెక్టులు, చెరువుల కింద సాగు చేసే పంటలకు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులత కలిసి వీడియో కాన్షరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సాగునీటి శాఖాధికారలు, వ్యవసా య, విద్యుత్ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, వ్యవసాయ బోరుబా వుల కింద సాగు అయ్యే యాసంగి పంటలకు సాగునీటిని అందించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సీజన్‌లో ఒక ఎకరం కూడా ఎండి పోకూడదని, వచ్చే 15 రోజులు చాలా కీలకమైన సమయమని అన్నారు. ప్రాజెక్టుల నుంచి చెరువులను నింపాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పర్యవేక్షించాలని, సాగునీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వృధా చేయకూడదని తెలిపారు. తహసీల్దార్, నీటి పారుదల శాఖ ఏఈ, ఏఓ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, తాగునీరు, సాగునీరుకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపా రు. జిల్లాలో గల ప్రతీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నూతన మెనూ అమలుపై తనిఖీలు నిర్వహించాలని, విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా వ్యవసాయా ధికారి శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషరావు, నీటి పారుదల శాఖ ఈఈలు ప్రభాకర్, గుణవంతరావు, జిల్లా గ్రామీణా భివృద్ది శాఖాధికారి దత్తారాం, సాగునీటి శాఖాధికారులు హాజరయ్యారు.
Updated Date - Mar 04 , 2025 | 12:02 AM