ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Actress Gautami : క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలి

ABN, Publish Date - Feb 05 , 2025 | 04:30 AM

ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని సినీనటి గౌతమి సూచించారు. ప్రపంచ క్యా న్సర్‌ దినాన్ని పురస్కరించుకొని ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు సుమారు రెండు

ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలి: సినీ నటి గౌతమి

వరంగల్‌ మెడికల్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని సినీనటి గౌతమి సూచించారు. ప్రపంచ క్యా న్సర్‌ దినాన్ని పురస్కరించుకొని ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు సుమారు రెండు వేలమందితో మంగళవారం వాకథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీనటి గౌతమి పాల్గొని మాట్లాడారు. గతంలో క్యాన్సర్‌ అంటే భయపడేవారని, తనకు క్యాన్సర్‌ వచ్చినా భయపడలేదన్నారు. 32 ఏళ్ల వయస్సులో తనకు క్యాన్సర్‌ వచ్చిందని, ఒక్కో పరీక్ష చేసి చెప్పడానికి కూడా వైద్యులు బాధపడ్డారని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ధూమపానం, మద్యపానం, పాన్‌, గుట్కా తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధులు దరిచేరవన్నారు. వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. దీనికి చికిత్స ఖర్చుతో కూడుకున్నది అయినందున, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:30 AM