స్పెషల్ ఆఫీసర్‌గా శివేంద్రప్రతాప్ బాధ్యతలు
ABN, Publish Date - Jan 27 , 2025 | 11:17 PM
పురపాలికల్లో ప్రత్యేక పాలన ప్రారంభమైంది. పాలమూరు, భూత్పూర్ పురపాలికలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులు కాగా, సోమవారం పాలమూరు పురపాలికలో బాధ్యతలు స్వీకరించారు.
మహబూబ్‌నగర్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : పురపాలికల్లో ప్రత్యేక పాలన ప్రారంభమైంది. పాలమూరు, భూత్పూర్ పురపాలికలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులు కాగా, సోమవారం పాలమూరు పురపాలికలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలని, ఎక్కడా రోడ్లపై చెత్తాచెదారం కనిపించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ ప్లాట్లలో కంప చెట్లు, పిచ్చిమొక్కలుంటే తొలగించాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
Updated Date - Jan 27 , 2025 | 11:17 PM