ఎవరిదో సెమీస్ బెర్త్?
ABN, Publish Date - Feb 28 , 2025 | 02:06 AM
చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో తొలి సెమీస్ బెర్త్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా-అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు నాకౌట్‌కు వెళ్తుంది. ఆసీస్ ఖాతాలో...
నేడు ఆసీ్‌స X అఫ్ఘాన్ పోరు
మ. 2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
మ్యాచ్ రద్దయితే కంగారూలకే చాన్స్
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో తొలి సెమీస్ బెర్త్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా-అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు నాకౌట్‌కు వెళ్తుంది. ఆసీస్ ఖాతాలో మూడు పాయింట్లు ఉండగా.. ఇంగ్లండ్‌పై సంచలన విజయంతో అఫ్ఘాన్ రెండు పాయింట్లతో ఈ రేసులో నిలిచింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆసీస్ నాలుగు పాయింట్లతో ముందుకెళ్లే అవకాశముంటుంది. కానీ మూడు పాయింట్లతో నిలిచే అఫ్ఘాన్ దాదాపు నిష్క్రమించినట్టే. ఒకవేళ ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికా (3 పాయింట్లు)పై అతి భారీ విజయం సాధిస్తే.. రన్‌రేట్ ప్రకారం అఫ్ఘాన్‌కు చాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే షాహిదీ సేన ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. బుధవారం అసాధారణ ఆటతీరుతో పటిష్ట ఇంగ్లండ్‌కు ఓటమి రుచి చూపించింది. 200 పరుగులు కూడా కష్టమే అనుకున్న చోట జద్రాన్ వీరోచిత శతకంతో ఏకంగా 300 స్కోరు దాటగలిగింది. అదే ఊపులో ఆసీ్‌సను కూడా మట్టికరిపించాలన్న ఆశయంతో ఉన్నారు. 2023 వన్డే వరల్డ్‌క్‌పలో మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో ఆసీస్ టీమ్ అఫ్ఘాన్‌ను చిత్తుగా ఓడించింది.
నేటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుని ఈ ఫార్మాట్‌లో కంగారూలపై తొలి విజయం అందుకోవాలనుకుంటోంది. అటు ఆసీస్ జట్టు టోర్నీలో ఒక్క మ్యాచే పూర్తిగా ఆడగా, వర్షంతో సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయ్యింది. కమిన్స్, స్టార్క్, హాజెల్‌వుడ్, మార్ష్ లేకపోయినా బలంగానే కనిపిస్తోంది. ఇంగ్లండ్‌పై 352 పరుగుల ఛేదనను సునాయాసంగా పూర్తి చేయగలిగింది. పైగా వారం రోజులపాటు విశ్రాంతి లభించడంతో ఆసీస్ ప్లేయర్లు తాజాగా బరిలోకి దిగబోతున్నారు. హెడ్, స్మిత్ బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది. లబుషేన్, ఇన్‌గ్లి్‌స, క్యారీ, మ్యాక్స్‌వెల్‌లతో మిడిలార్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
టీమిండియా భారీ విరాళం.. మనసులు గెలిచారు బాస్
రోహిత్ సేనపై కుట్ర.. ఫలితం అనుభవించారు
కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 28 , 2025 | 02:06 AM