ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రెస్‌ కోడ్‌ను పాటిస్తాం

ABN, Publish Date - Jan 23 , 2025 | 05:08 AM

చాంపియన్స్‌ ట్రోఫీలో ఐసీసీ నిబంధనల ప్రకారం డ్రెస్‌ కోడ్‌ను పాటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పష్టం చేశాడు. టీమిండియా అధికారిక జెర్సీపై ఆతిథ్య పాకిస్థాన్‌ పేరును భారత బోర్డు...

ఊహాగానాలకు తెరదించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీలో ఐసీసీ నిబంధనల ప్రకారం డ్రెస్‌ కోడ్‌ను పాటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పష్టం చేశాడు. టీమిండియా అధికారిక జెర్సీపై ఆతిథ్య పాకిస్థాన్‌ పేరును భారత బోర్డు వ్యతిరేకిస్తోందన్న ఊహాగానాలను సైకియా కొట్టిపడేశాడు. ‘ఐసీసీ నిబంధనల ప్రకారం నడుచుకొంటాం. ఈ విషయంలో అన్ని జట్ల తరహాలోనే క్రీడా స్ఫూర్తిని చాటుతామ’ని సైకియా అన్నాడు. ఇక, పాక్‌లో జరిగే ప్రీ టోర్నమెంట్‌ కార్యక్రమాల్లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాల్గొంటాడా, లేదా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీ వచ్చేనెల 19 నుంచి హైబ్రిడ్‌ ఫార్మాట్‌లో జరగనుంది.

Updated Date - Jan 23 , 2025 | 05:08 AM