వన్డేల్లో యూఎస్‌ఏ ప్రపంచ రికార్డు
ABN, Publish Date - Feb 19 , 2025 | 03:21 AM
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా యూఎ్‌సఏ రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఒమన్‌తో జరిగిన వరల్డ్‌కప్ లీగ్2 మ్యాచ్‌లో యూఎస్...
అల్ అమరత్ (మస్కట్): వన్డే క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా యూఎ్‌సఏ రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఒమన్‌తో జరిగిన వరల్డ్‌కప్ లీగ్2 మ్యాచ్‌లో యూఎస్ 35.3 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. మిలింద్ (47 నాటౌట్) మాత్రమే రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 25.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూలడంతో 57 పరుగుల తేడాతో యూఎస్ నెగ్గింది. స్పిన్నర్లు కెనిగె (5/11), యాసిర్ (2/10), మిలింద్ (2/17) దెబ్బతీశారు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో పూర్తి ఓవర్లపాటు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా యూఎస్ సంబరాల్లో మునిగింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత్ పేరిట ఉండేది. 1985లో పాక్‌పై భారత్ 125 పరుగులు చేయగా, ప్రత్యర్థిని 87 పరుగులకే పరిమితం చేసింది.
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Feb 19 , 2025 | 03:21 AM