ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శరత్‌.. టీటీకి గుడ్‌బై

ABN, Publish Date - Mar 06 , 2025 | 04:37 AM

భారత టీటీకి అంతర్జాతీయ సొబగులద్దిన ఆటగాడు. చైనా, కొరియా, జపాన్‌ దేశాల మేటి ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా...

నెలాఖరులో జరిగే డబ్ల్యూటీటీ చివరిదని ప్రకటన

చెన్నై: భారత టీటీకి అంతర్జాతీయ సొబగులద్దిన ఆటగాడు. చైనా, కొరియా, జపాన్‌ దేశాల మేటి ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగు అథ్లెట్‌. రెండు దశాబ్దాలకుపైగా కెరీర్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించి దేశ టేబుల్‌ టెన్నిస్‌కు పర్యాయంగా నిలిచిన 42 ఏళ్ల ఆచంట శరత్‌ కమల్‌ ఆటకు వీడ్కోలు పలకనున్నాడు. 22 ఏళ్ల సుదీర్ఘ టీటీ కెరీర్‌ నుంచి ఈ నెలాఖరున రిటైర్‌ కానున్నట్టు బుధవారం వెల్లడించాడు. ఈనెల 25 నుంచి 30 వరకు ఇక్కడ జరిగే వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ కంటెడర్‌ టోర్నమెంట్‌ (డబ్ల్యూటీటీ) తనకు కెరీర్‌లో చివరిదని తెలిపాడు. ఆ టోర్నీ సందర్భంగా సొంతూళ్లో, కుటుంబ సభ్యులు, స్నేహితుల నడుమ ఆటకు గుడ్‌ బై చెప్పాలని తమిళనాడుకు చెందిన శరత్‌ నిర్ణయించుకున్నాడు.


అసామాన్య ఆటగాడు: కమల్‌ కెరీర్‌లో సాధించిన ఘనతలు లెక్కకు మిక్కిలి. అతడు అందుకున్న విజయాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ఏకంగా 7 కామన్వెల్త్‌ స్వర్ణ పతకాలున్నాయి. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు దక్కించుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో శరత్‌ కమల్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడల ప్రారంభోత్సవంలో దేశ పతాకను చేబూని భారత బృందాన్ని నడిపించాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉత్సాహంతో మరో కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో పాల్గొనాలని కమల్‌ భావించాడు. కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ‘భారీగా అభిమానులు హాజరయ్యే టోర్నీ సందర్భంగా నా ర్యాకెట్‌కు, బందన (మ్యాచ్‌ల సమయంలో కమల్‌ తలకు ధరించే కర్చీ్‌ఫ)కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని శరత్‌ చెప్పాడు.

కమల్‌ కెరీర్‌ ఇలా..

  • కామన్వెల్త్‌ స్వర్ణాలు-7, రజతాలు-3, కాంస్యాలు-3

  • ఆసియా క్రీడలు- 2 కాంస్యాలు

  • ఆసియా చాంపియన్‌షి్‌ప- 4 కాంస్యాలు

  • జాతీయ చాంపియన్‌షి్‌ప- 10 సార్లు

అవార్డులు

పద్మశ్రీ, ఖేల్‌రత్న, అర్జున

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..


Updated Date - Mar 06 , 2025 | 04:37 AM