Rohit Sharma : రంజీల్లో ఆడుతున్నా..
ABN, Publish Date - Jan 19 , 2025 | 05:45 AM
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈనెల 23 నుంచి జమ్మూ కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో తాను బరిలోకి దిగనున్నట్టు రోహిత్ తెలిపాడు. 2015 నవంబరులో హిట్‌మ్యాన్ చివరి రంజీ
ముంబై: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈనెల 23 నుంచి జమ్మూ కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో తాను బరిలోకి దిగనున్నట్టు రోహిత్ తెలిపాడు. 2015 నవంబరులో హిట్‌మ్యాన్ చివరి రంజీ ఆడాడు. భారత ఆటగాళ్లు ఆసీస్ పర్యటనలో విఫలం కావడంతో బీసీసీఐ పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా అందుబాటులో ఉండే ఆటగాళ్లంతా దేశవాళీల్లో ఆడాల్సిందేనని తేల్చింది. ఆసీస్ టూర్‌లో రోహిత్ నాలుగు టెస్టుల్లో 31 పరుగులే చేసి విమర్శల పాలయ్యాడు. అయితే ఎవరూ కావాలని రంజీలకు దూరంగా ఉండరని, తమ బిజీ షెడ్యూల్ కారణంగా తగిన విశ్రాంతిని కోరుకుంటామని రోహిత్ వివరించాడు.
Updated Date - Jan 19 , 2025 | 05:45 AM