న్యూజిలాండ్‌దే సిరీస్
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:01 AM
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను మరో వన్డే ఉండగానే న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్ 113 పరుగులతో గెలిచింది...
హామిల్టన్: శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను మరో వన్డే ఉండగానే న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్ 113 పరుగులతో గెలిచింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించగా తొలుత కివీస్ 255/9 స్కోరు చేసింది. తీక్షణ (4/44) హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఛేదనలో శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది.
Updated Date - Jan 09 , 2025 | 02:01 AM