కివీస్ వచ్చేసింది భారత్‌తో ఫైనల్‌కు సై
ABN, Publish Date - Mar 06 , 2025 | 04:41 AM
పరుగుల వరద పారిన మ్యాచ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్ చాంపియన్స్ ట్రోఫీ (సీటీ) ఫైనల్‌కు దూసుకెళ్లగా.. దక్షిణాఫ్రికా మరోసారి నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తయింది...
చాంపియన్స్ ట్రోఫీ
భారత్‌తో ఫైనల్‌కు సై
రచిన్, కేన్ శతక హోరు
సెమీ్‌సలో దక్షిణాఫ్రికా చిత్తు
మిల్లర్ సెంచరీ వృథా
లాహోర్: పరుగుల వరద పారిన మ్యాచ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్ చాంపియన్స్ ట్రోఫీ (సీటీ) ఫైనల్‌కు దూసుకెళ్లగా.. దక్షిణాఫ్రికా మరోసారి నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తయింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో భారత్‌తో అమీతుమీకి కివీస్ సిద్ధమైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 108), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102) సెంచరీల మోతతో.. బుధవారం జరిగిన రెండో సెమీ్‌సలో కివీస్ 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 362/6 స్కోరు సాధించింది. ఎన్‌గిడి 3, రబాడ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో డేవిడ్ మిల్లర్ (67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) శతకంతో పోరాడినా.. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. శాంట్నర్ 3, హెన్రీ, ఫిలిప్స్ చెరో 2 వికెట్లు తీశారు. రచిన్, కేన్ విజృంభణ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న కివీస్.. పవర్‌ప్లేలోనే ఓపెనర్ యంగ్ (21) వికెట్‌ను కోల్పోయింది. అయుతే, మరో ఓపెనర్ రచిన్, విలియమ్సన్ సఫారీ బౌలర్లను ఆటాడుకొన్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 164 రన్స్ జోడించడంతో.. కివీస్ కొండంత స్కోరు చేసింది. శతకం సాధించిన రచిన్‌ను అవుట్ చేసిన రబాడ.. జట్టుకు ఊరటనిచ్చాడు. డెత్ ఓవర్లలో డారెల్ మిచెల్ (49), గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) బ్యాట్లను ఝుళిపించడంతో జట్టు స్కోరు 360 దాటింది.
దెబ్బకొట్టిన శాంట్నర్: భారీ ఛేదనను దక్షిణాఫ్రికా ఆశావహంగా ఆరంభించినా.. కెప్టెన్ శాంట్నర్ (3/43) కీలక సమయంలో మూడు వికెట్లతో దెబ్బకొట్టడంతో సఫారీల ఆట ఒక్కసారిగా గతితప్పింది. ఓపెనర్ రికెల్టన్ (17)ను హెన్రీ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. కానీ, బవుమా (56), డుస్సెన్ (69) రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, అర్ధ శతకం సాధించిన బవుమాను శాంట్నర్ అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 23 ఓవర్లలో 128/2. మిడిలార్డర్‌లో హిట్టర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తిగా మారుతుందను కున్నా.. డుస్సెన్‌తోపాటు క్లాసెన్ (3)ను శాంట్నర్ పెవిలియన్ చేర్చడంతో సౌతాఫ్రికా 167/4తో కష్టాల్లో పడింది. ఈదశలో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ.. బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. నిలకడగా ఆడుతున్న మార్‌క్రమ్ (31)ను రచిన్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేయడంతో.. మ్యాచ్ కివీ్‌సవైపు మొగ్గింది. మల్డర్ (8), జెన్సన్ (3), కేశవ్ మహరాజ్ (1) సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. చివరి బంతికి సెంచరీ చేసిన మిల్లర్.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్: యంగ్ (సి) మార్‌క్రమ్ (బి) ఎన్‌గిడి 21, రచిన్ (సి) క్లాసెన్ (బి) రబాడ 108, విలియమ్సన్ (సి) ఎన్‌గిడి (బి) మల్డర్ 102, మిచెల్ (సి) రబాడ (బి) ఎన్‌గిడి 49, లాథమ్ (బి) రబాడ 4, ఫిలిప్స్ (నాటౌట్) 49, బ్రేస్‌బెల్ (సి) రికెల్టన్ (బి) ఎన్‌గిడి 16, శాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 50 ఓవర్లలో 362/6; వికెట్ల పతనం: 1-48, 2-212, 3-251, 4-257, 5-314, 6-360; బౌలింగ్: జెన్సన్ 10-0-79-0, ఎన్‌గిడి 10-0-72-3, రబాడ 10-1-70-2, ముల్డర్ 6-0-48-1, కేశవ్ 10-0-65-0, మార్‌క్రమ్ 4-0-23-0.
దక్షిణాఫ్రికా: రికెల్టన్ (సి) బ్రేస్‌వెల్ (బి) హెన్రీ 17, బవుమా (సి) విలియమ్సన్ (బి) శాంట్నర్ 56, డుస్సెన్ (బి) శాంట్నర్ 69, మార్‌క్రమ్ (సి అండ్ బి) రచిన్ 31, క్లాసెన్ (సి) హెన్రీ (బి) శాంట్నర్ 3, మిల్లర్ (నాటౌట్) 100, మల్డర్ (సి) రచిన్ (బి) బ్రేస్‌వెల్ 8, జెన్సన్ (ఎల్బీ) ఫిలిప్స్ 3, కేశవ్ (సి) లాథమ్ (బి) ఫిలిప్స్ 1, రబాడ (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 16, ఎన్‌గిడి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 50 ఓవర్లలో 312/9; వికెట్ల పతనం: 1-20, 2-125, 3-161, 4-167, 5-189, 6-200, 7-212, 8-218, 9-256; బౌలింగ్: హెన్రీ 7-0-43-2, జేమిసన్ 7-1-57-0, విల్ ఓరోక్ 8-0-69-0, బ్రేస్‌వెల్ 10-0-53-1, శాంట్నర్ 10-0-43-3, రచిన్ 5-0-20-1, ఫిలిప్స్ 3-0-27-2.
1
చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా న్యూజిలాండ్ (362/6). ఇదే టోర్నీలో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా (356/5) చేసిన రికార్డును కివీస్ బద్దలుకొట్టింది.
5
వన్డేల్లో రచిన్ రవీంద్ర సెంచరీలు. ఇవన్నీ ఐసీసీ టోర్నీల్లో సాధించినవే. 2023 వరల్డ్‌కప్‌లో 3 శతకాలు బాదిన రచిన్.. ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో 2 సెంచరీలు కొట్టాడు. ఇలా ఐసీసీ టోర్నీలో ఐదు శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా రచిన్ రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మదుల్లా (4 సెంచరీలు)ను దాటాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 06 , 2025 | 04:42 AM