ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kho-Kho World Cup : ఖో-ఖో వరల్డ్‌క్‌పలో మనోడి మెరుపులు

ABN, Publish Date - Jan 21 , 2025 | 07:30 AM

దేశానికి తొలి ఖో-ఖో వరల్డ్‌క్‌పను అందించిన భారత పురుషుల జట్టులో తెలుగు తేజం పోతిరెడ్డి శివారెడ్డి అసామాన్య ప్రతిభ దాగి ఉంది. బాపట్ల జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన శివారెడ్డి ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఫైనల్‌ వరకు జరిగిన మొత్తం ఏడు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దేశానికి తొలి ఖో-ఖో వరల్డ్‌క్‌పను అందించిన భారత పురుషుల జట్టులో తెలుగు తేజం పోతిరెడ్డి శివారెడ్డి అసామాన్య ప్రతిభ దాగి ఉంది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన శివారెడ్డి ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఫైనల్‌ వరకు జరిగిన మొత్తం ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లో నాలుగు పాయింట్లు సాధించిన శివారెడ్డి బెస్ట్‌ ఎటాకర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ప్రతి మ్యాచ్‌లో నాలుగు పాయింట్లు తగ్గకుండా సాధించి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కఠినమైన ప్రత్యర్థులైన నేపాల్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల పైనా శివారెడ్డి అద్భుత ప్రదర్శన కనబర్చడం భారత జట్టు విజయాలకు బాగా ఉపకరించింది. శివారెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు ఈనెల 28 నుంచి జరిగే జాతీయ క్రీడల్లో బరిలోకి దిగనుంది.


రైల్లో కింద కూర్చొని..: చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి కెరీర్‌ ప్రారంభంలో అనేక ఇబ్బందులు పడ్డాడు. శివారెడ్డి ప్రతిభను గుర్తించిన కోచ్‌ సీతారాంరెడ్డి అద్దంకిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ఖో-ఖో అకాడమీలో అతడిని తీర్చిదిద్ది జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తయారు చేశారు. కెరీర్‌ తొలినాళ్లలో శివారెడ్డి జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్ర తరఫున ఆడేందుకు రైలులో జనరల్‌ బోగీలో కింద కూర్చొని 35 గంటలకు పైగా ప్రయాణం చేసి వెళ్లేవాడు. ఖో-ఖో ఆడి ఏం సాధిస్తావంటూ హేళన చేసిన వారికి ఈ వరల్డ్‌కప్‌ విజయమే సమాధానమని శివారెడ్డి ఇప్పుడు గర్వంగా చెబుతున్నాడు.

Updated Date - Jan 21 , 2025 | 11:39 AM