ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sanju Samson : సంజూకు గాయం

ABN, Publish Date - Feb 04 , 2025 | 04:26 AM

భారత టీ20 జట్టు వికెట్‌ కీపక్‌ సంజూ శాంసన్‌ చేతి వేలికి గాయమైంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో పేసర్‌ ఆర్చర్‌ వేసిన బంతి సంజూ కుడిచేతి చూపుడు వేలికి బలంగా తాకింది. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు దూరమైన తను స్కానింగ్‌కు వెళ్లగా..

ఆరు వారాల విశ్రాంతి

ముంబై: భారత టీ20 జట్టు వికెట్‌ కీపక్‌ సంజూ శాంసన్‌ చేతి వేలికి గాయమైంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో పేసర్‌ ఆర్చర్‌ వేసిన బంతి సంజూ కుడిచేతి చూపుడు వేలికి బలంగా తాకింది. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు దూరమైన తను స్కానింగ్‌కు వెళ్లగా.. ఫ్రాక్చర్‌ అయినట్టు తేలింది. దీంతో ఐదు నుంచి ఆరు వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం తన స్వస్థలం తిరువనంతపురం చేరుకున్నాడని, పునరావాసం కోసం త్వరలోనే బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లనున్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. గాయం వల్ల ఈనెల 8 నుంచి జరిగే రంజీ క్వార్టర్స్‌ మ్యాచ్‌కు సంజూ దూరమయ్యాడు. తాజా టీ20 సిరీ్‌సలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ 5 మ్యాచ్‌ల్లో 51 రన్స్‌ మాత్రమే చేసి నిరాశపరిచాడు. పేసర్లు ఆర్చర్‌, ఉడ్‌, సకీబ్‌ షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడలేక పవర్‌ప్లేలోనే వికెట్‌ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం భారత వన్డే జట్టులో కూడా లేని శాంసన్‌ తిరిగి టీ20 బరిలోకి దిగాలంటే ఆగస్టులో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ వరకు వేచిచూడాలి.


జట్టు మారింది..

సూర్యకుమార్‌ కెప్టెన్సీలో భారత టీ20 జట్టు ఇంగ్లండ్‌పై 4-1తో సిరీస్‌ గెలుచుకుంది. ఇక ఇప్పుడు మూడు వన్డేల సిరీ్‌సలో రోహిత్‌ కెప్టెన్సీలో సరికొత్త జట్టుతో బరిలోకి దిగనుంది. ఈనెల 6,9,12తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు భారత్‌ ఆడే సన్నాహక మ్యాచ్‌లు ఇవే కానున్నాయి. దీంతో ఈ సిరీస్‌ ద్వారా తుది జట్టుపై ఓ అంచనాకు రావచ్చు. టీ20 సిరీ్‌సలో ఆడిన హార్దిక్‌, సుందర్‌, షమి, అక్షర్‌, అర్ష్‌దీప్‌, హర్షిత్‌ మాత్రమే వన్డే టీమ్‌లో ఉన్నారు. సూర్య, తిలక్‌, దూబే, అభిషేక్‌, వరుణ్‌, బిష్ణోయ్‌, రింకూ తదితరులకు వన్డే జట్టులో చోటు లభించలేదు. కాగా, కోహ్లీ, జైస్వాల్‌, గిల్‌, రాహుల్‌, పంత్‌, జడేజా, కుల్దీ్‌పలాంటి స్టార్లతో కూడిన భారత్‌ వన్డే సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌ను ఓడించాలన్న పట్టుదలతో ఉంది.


ఇవీ చదవండి:

కెరీర్‌లో కొట్టిన సిక్సులు.. ఒకే మ్యాచ్‌లో బాదేశాడు

ఒక్క ఇన్నింగ్స్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ అన్నింటా అసాధ్యుడే

అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 04:26 AM