అర్జున్‌ను వెనక్కి నెట్టిన గుకేష్
ABN, Publish Date - Jan 24 , 2025 | 04:51 AM
సూపర్ ఫామ్ లో ఉన్న వరల్డ్ చాంపియన్ గుకేష్.. ఫిడే ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఇరిగేసిని వెనక్కు నెట్టాడు. 2784 ర్యాంకింగ్ పాయింట్లతో గుకేష్...
ఫిడే ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ: సూపర్ ఫామ్ లో ఉన్న వరల్డ్ చాంపియన్ గుకేష్.. ఫిడే ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఇరిగేసిని వెనక్కు నెట్టాడు. 2784 ర్యాంకింగ్ పాయింట్లతో గుకేష్ నాలుగో ర్యాంక్‌లో నిలవగా.. కొన్ని నెలలుగా భారత టాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్న అర్జున్ (2779.5 పాయిం ట్లు) ఐదో స్థానానికి పడిపోయాడు. ఇటీవలి కాలం లో ఇరిగేసి వరుసగా విఫలమవుతుండడం అతడి ర్యాంక్‌పై ప్రభావం చూపింది. నార్వే దిగ్గజం కార్ల్‌సన్ టాప్‌లో కొనసాగుతుండగా.. హికరు నకముర, ఫాబియానో కరువానా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Updated Date - Jan 24 , 2025 | 04:51 AM