ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిల్‌ శతక జిగేల్‌

ABN, Publish Date - Feb 21 , 2025 | 04:56 AM

ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ విజయంతో ఆరంభించింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 నాటౌట్‌) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో శతకంతో అజేయంగా...

నేటి మ్యాచ్‌

అఫ్ఘానిస్థాన్‌ X దక్షిణాఫ్రికా

మ.2.30 నుంచి - స్టార్‌స్పోర్ట్స్‌లో

  • షమికి ఐదు వికెట్లు

  • పోరాడిన బంగ్లాదేశ్‌

  • తౌహీద్‌ శతకం వృథా

దుబాయ్‌: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ విజయంతో ఆరంభించింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 నాటౌట్‌) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో శతకంతో అజేయంగా నిలిచాడు. అయితే టోర్నీలో బలహీనంగా కనిపిస్తున్న బంగ్లాదేశ్‌ సైతం గట్టి పోటీనే ఇచ్చింది. బ్యాటింగ్‌లో అసమాన పోరాటంతో పాటు బౌలింగ్‌లోనూ ప్రభావం చూపి భారత మిడిలార్డర్‌ను కట్టడి చేసింది. కానీ గిల్‌కు జతగా కెప్టెన్‌ రోహిత్‌ (41), రాహుల్‌ (41 నాటౌట్‌) సహకారం అందించడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. గిల్‌ తన చివరి నాలుగు వన్డేల్లో రెండు ఫిఫ్టీలు, రెండు సెంచరీలు సాధించడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. తౌహీద్‌ హ్రిదయ్‌ (100) కీలక శతకంతో ఆదుకున్నాడు. అతడికి జాకెర్‌ అలీ (68) సహకరించాడు. షమికి ఐదు, హర్షిత్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. రిషాద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.


తుదికంటా నిలిచి..: ఛేదనలో పిచ్‌ నెమ్మదించినా.. తొలి పవర్‌ప్లేలో భారత్‌ ఇన్నింగ్స్‌ మాత్రం వేగంగానే సాగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూకుడు కొనసాగించగా, మరో ఓపెనర్‌ గిల్‌ అదిరే ఆటతో తుదికంటా నిలిచాడు. తొలి వికెట్‌కు 59 బంతుల్లోనే 69 పరుగులు జత చేరాక రోహిత్‌ను పేసర్‌ టస్కిన్‌ అవుట్‌ చేశాడు. తర్వాత గిల్‌, విరాట్‌ (22) ఇద్దరూ ఆచితూచి ఆడారు. విరాట్‌ను లెగ్‌ స్పిన్నర్‌ రిషాద్‌ అవుట్‌ చేశాడు. కాసేపటికే గిల్‌ వరుసగా నాలుగో అర్ధసెంచరీ పూర్తి చేయగా.. మరోవైపు శ్రేయాస్‌ (15), అక్షర్‌ (8) పెవిలియన్‌ చేరారు. 37వ ఓవర్‌లో రాహుల్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జాకెర్‌ వదిలేశాడు. ఇక ఆ తర్వాత తను చక్కటి షాట్లతో గిల్‌కు అండగా నిలిచాడు. 45వ ఓవర్‌లో 6,4తో జోరు పెంచిన గిల్‌ వన్డేల్లో శతకం పూర్తి చేశాడు. అటు విజయానికి ఏడు పరుగులే ఉండడంతో రాహుల్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు అజేయంగా 87 పరుగులు జత చేరాయి.


35/5 స్కోరు నుంచి 200+: పది ఓవర్లు కూడా పూర్తికాకుండానే సగం జట్టు పెవిలియన్‌కు చేరిన వేళ బంగ్లా బ్యాటర్లు తౌహీద్‌, జాకెర్‌ మొక్కవోని పట్టుదలతో క్రీజులో అతుక్కుపోయారు. ఆరో వికెట్‌కు తమ వన్డే చరిత్రలోనే 154 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని సమకూర్చారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ సౌమ్య వికెట్‌ కోల్పోయింది. అతడిని షమి అవుట్‌ చేయగా, ఆ వెంటనే కెప్టెన్‌ షంటో (0) హర్షిత్‌కు చిక్కాడు. అప్పటికి స్కోరు 2/2. మెహిదీ హసన్‌ (5) కూడా విఫలం కాగా.. తొమ్మిదో ఓవర్‌లో జట్టుకు భారీ ఝలక్‌ తగిలింది. మరో ఓపెనర్‌ తన్‌జీద్‌ (25), ముష్ఫికర్‌ (0)లను వరుస బంతుల్లో అక్షర్‌ దెబ్బతీశాడు. ఈ దశలో స్కోరు 35/5 మాత్రమే. కానీ తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగిన తౌహీద్‌, జాకెర్‌ నిలకడైన ఆటతో బంగ్లా కోలుకుంది. అటు భారత ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా ఈ జోడీకి కలిసివచ్చింది. తౌహీద్‌ ఓ క్యాచ్‌, స్టంప్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చివరకు 206 బంతులను ఎదుర్కొన్న ఈ జోడీని 43వ ఓవర్‌లో షమి విడదీశాడు. ఆ తర్వాత బంగ్లా వేగంగా వికెట్లు కోల్పోగా తౌహీద్‌ 114 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. రాణా చేతిలో ఆఖరి వికెట్‌గా తను వెనుదిరగడంతో బంగ్లా ఇన్నింగ్స్‌ ముగిసింది.

భారత్‌ బోణీ

స్కోరుబోర్డు

బంగ్లాదేశ్‌: తన్‌జీద్‌ హసన్‌ (సి) రాహుల్‌ (బి) అక్షర్‌ 25; సౌమ్య (సి) రాహుల్‌ (బి) షమి 0; షంటో (సి) విరాట్‌ (బి) హర్షిత్‌ 0; మెహిదీ హసన్‌ (సి) గిల్‌ (బి) షమి 5; తౌహీద్‌ హ్రిదయ్‌ (సి) షమి (బి) హర్షిత్‌ 100; ముష్ఫికర్‌ (సి) రాహుల్‌ (బి) అక్షర్‌ 0; జాకెర్‌ అలీ (సి) కోహ్లీ (బి) షమి 68; రిషాద్‌ (సి) హార్దిక్‌ (బి) హర్షిత్‌ 18; తన్‌జీమ్‌ హసన్‌ (బి) షమి 0; టస్కిన్‌ (సి) శ్రేయాస్‌ (బి) షమి 3; ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 49.4 ఓవర్లలో 228 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-1, 2-2, 3-26, 4-35, 5-35, 6-189, 7-214, 8-215, 9-228, 10-228; బౌలింగ్‌: షమి 10-0-53-5; హర్షిత్‌ 7.4-0-31-3; అక్షర్‌ 9-1-43-2; హార్దిక్‌ 4-0-20-0; జడేజా 9-0-37-0; కుల్దీప్‌ 10-0-43-0.


భారత్‌: రోహిత్‌ (సి) రిషాద్‌ (బి) టస్కిన్‌ 41; గిల్‌ (నాటౌట్‌) 101; విరాట్‌ (సి) సౌమ్య (బి) రిషాద్‌ 22; శ్రేయాస్‌ (సి) షంటో (బి) ముస్తాఫిజుర్‌ 15; అక్షర్‌ (సి అండ్‌ బి) రిషాద్‌ 8; రాహుల్‌ (నాటౌట్‌) 41; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 46.3 ఓవర్లలో 231/4. వికెట్ల పతనం: 1-69, 2-112, 3-133, 4-144; బౌలింగ్‌: టస్కిన్‌ 9-0-36-1; ముస్తాఫిజుర్‌ 9-0-62-1; తన్‌జీమ్‌ 8.3-0-58-0; మెహిదీ హసన్‌ 10-0-37-0; రిషాద్‌ 10-0-38-2.

1

ఐసీసీ టోర్నీ (చాంపియన్స్‌, వరల్డ్‌క్‌ప)ల్లో భారత్‌ తరఫున ఎక్కువ వికెట్లు (60) తీసిన బౌలర్‌గా షమి. జహీర్‌ (59)ను అధిగమించాడు. అలాగే వన్డేల్లో జట్టు తరఫున వేగంగా (104 మ్యాచ్‌ల్లో) 200 వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. ఓవరాల్‌గా స్టార్క్‌ (102) తర్వాత రెండో బౌలర్‌.

1

భారత్‌ తరఫున తక్కువ ఇన్నింగ్స్‌ (51)లోనే 8 వన్డే సెంచరీలు పూర్తి చేసిన బ్యాటర్‌గా గిల్‌.

1

వన్డేల్లో భారత్‌ నుంచి ఎక్కువ క్యాచ్‌లు (156) అందుకుని అజరుద్దీన్‌తో కలిసి తొలి స్థానంలో నిలిచిన కోహ్లీ. ఓవరాల్‌గా జయవర్ధనె (218) ముందున్నాడు.

2

వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (261)లోనే 11 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రోహిత్‌. విరాట్‌ (222) టాప్‌లో ఉన్నాడు.



ఇవీ చదవండి:

చరిత్ర తిరగరాసిన రోహిత్

షమి తుఫాను.. 4 రికార్డులు బ్రేక్

అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 04:56 AM