ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గార్డ్‌నర్‌ ధనాధన్‌

ABN, Publish Date - Feb 28 , 2025 | 02:01 AM

ఆష్లే గార్డ్‌నర్‌ (31 బంతుల్లో 58) ధనాధన్‌ అర్ధ శతకంతో.. గుజరాత్‌ జెయింట్స్‌ మళ్లీ గెలుపు బాటపట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో...

డబ్ల్యూపీఎల్‌లో నేడు

ఢిల్లీ X ముంబై

రాత్రి 7.30 నుంచి, స్టార్‌ స్పోర్ట్స్‌లో

  • గుజరాత్‌ గెలుపు

  • బెంగళూరుకు వరుసగా మూడో ఓటమి

బెంగళూరు: ఆష్లే గార్డ్‌నర్‌ (31 బంతుల్లో 58) ధనాధన్‌ అర్ధ శతకంతో.. గుజరాత్‌ జెయింట్స్‌ మళ్లీ గెలుపు బాటపట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచింది. కాగా, మంధాన సేనకు ఇది వరుసగా మూడో ఓటమి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 125/7 స్కోరు చేసింది. దియేంద్ర డోటిన్‌, తనూజ కన్వర్‌ చెరో రెండు వికెట్లతో విజృంభించడంతో.. పవర్‌ప్లేలోపే డానీ వ్యాట్‌ (4), ఎలీస్‌ పెర్రీ (0), కెప్టెన్‌ స్మృతి మంధాన (10) వికెట్లను చేజార్చుకొన్న చాలెంజర్స్‌ 25/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, రాగ్వి బిస్త్‌ (22), కనిక అహూజ (33), జార్జియా వేర్హమ్‌ (20 నాటౌట్‌), కిమ్‌ గార్త్‌ (14) తలో చేయి వేయడంతో.. టీమ్‌ స్కోరు కష్టంగా 120 మార్క్‌ దాటింది. ఛేదనలో గుజరాత్‌ 16.3 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు చేసి గెలిచింది. గార్డ్‌నర్‌, లిచ్‌ఫీల్డ్‌ (30 నాటౌట్‌) నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జెయింట్స్‌ సులువుగా నెగ్గింది. బెత్‌ మూనీ (17), హేమలత (11)ను రేణుక అవుట్‌ చేయగా.. హర్లీన్‌ డియోల్‌ (5), గార్డ్‌నర్‌ను వేర్హమ్‌ పెవిలియన్‌ చేర్చింది.


ఇవీ చదవండి:

టీమిండియా భారీ విరాళం.. మనసులు గెలిచారు బాస్

రోహిత్ సేనపై కుట్ర.. ఫలితం అనుభవించారు

కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 02:01 AM