ఐపీఎల్‌లో ఆ ప్రకటనలొద్దు
ABN, Publish Date - Mar 11 , 2025 | 02:53 AM
ఐపీఎల్‌లో మద్యం, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను నిషేధించాలని నిర్వాహకులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది...
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశం
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మద్యం, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను నిషేధించాలని నిర్వాహకులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతేకాదు..ఆ రెండు ఉత్పత్తులను తయారు చేసే సంస్థల ఇతర ప్రకటనలకూ చోటివ్వరాదని సూచించింది. ఈమేరకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్‌కు ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయెల్ లేఖ రాశారు. క్రికెటర్లు.. దేశ యువతకు మార్గదర్శకులని, అలాంటి ఆటగాళ్లకు మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండకూడదని అన్నారు. ‘ఈ నిబంధనలను ఐపీఎల్‌లో తప్పకుండా పాటించాలి. మ్యాచ్‌లు జరిగే స్టేడియాల లోపల, అలాగే ప్రత్యక్ష ప్రసారాలు, ఐపీఎల్‌తో ముడిపడిన ఇతర కార్యక్రమాల సందర్భంగా జాతీయ టెలివిజన్‌లలో మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలు కనిపించకూడదు’ అని గోయెల్ స్పష్టంజేశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 11 , 2025 | 02:53 AM