ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లెఫ్ట్‌-రైట్‌ ఓకేనా?

ABN, Publish Date - Feb 11 , 2025 | 04:33 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలుచుకుని ఇప్పటికే సిరీ్‌సను కూడా ఖాతాలో వేసుకుంది. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఈ ఫలితం...

రాహుల్‌, అక్షర్‌ స్థానాల మార్పుపై చర్చ

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలుచుకుని ఇప్పటికే సిరీ్‌సను కూడా ఖాతాలో వేసుకుంది. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఈ ఫలితం అదుర్స్‌ అనిపించినా.. ఈ రెండింట్లో కోచ్‌ గంభీర్‌ చేసిన ఓ ప్రయోగంపై మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. వన్డేల్లో ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగే కేఎల్‌ రాహుల్‌ను ఆర్డర్‌లో కిందికి దించి, ఆ స్థానంలో లెఫ్ట్‌ హ్యాండర్‌ అక్షర్‌ పటేల్‌ను ఆడిస్తుండడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే.. ఈ ప్రయోగంతో స్పెషలిస్ట్‌ టాపార్డర్‌ బ్యాటర్‌ అయిన రాహుల్‌ రెండు మ్యాచ్‌ల్లో (2, 10)నూ విఫలమయ్యాడు. అటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ మాత్రం ఐదో నెంబర్‌లో 52, 41 (నాటౌట్‌) రన్స్‌తో అదరగొట్టాడు. కానీ ఈ చర్యతో సమర్థుడైన బ్యాటర్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారన్న భావన అంతటా వ్యక్తమవుతోంది. ప్రతిష్ఠాత్మక టోర్నీకి ముందు అతడికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండాపోవడాన్ని ఎలా చూస్తారని, రాహుల్‌ బ్యాటర్‌ అనే విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మర్చిపోతున్నట్టుందని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. రాహుల్‌ ఐదో స్థానంలో బరిలోకి దిగిన 30 మ్యాచ్‌ల్లో రెండు శతకాలు, 9 హాఫ్‌ సెంచరీలతో 1259 పరుగులు సాధించాడు. సగటు కూడా 60కి దగ్గరలో ఉండడం విశేషం. అంతెందుకు.. 2023 వన్డే వరల్డ్‌క్‌పలో 11 మ్యాచ్‌లో తను 75.33 సగటుతో 452 పరుగులు సాధించాడు. అదే ఆరో స్థానంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో చేసింది 42 పరుగులే కావడం గమనార్హం. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నా రాహుల్‌ ఎక్కడ ఆడితే బెటర్‌ అనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే ప్రయోగాలు జట్టుకు లాభపడేలా ఉండాలి కానీ.. బ్యాటర్‌ ఫామ్‌ను దెబ్బతీసేలా ఉండకూడదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు ఇలాంటి వ్యూహం ఎందుకని ప్రశ్నిస్తే... మిడిలార్డర్‌లో ఓ ఎడమ చేతి బ్యాటర్‌ ఉండాలని జట్టు కోరుకుంటోందన్నది సమాధానం. అలా అయితే కుడి-ఎడమ కాంబినేషన్‌ ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెడుతుందని, ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడం తేలికవుతుందని కోచ్‌, కెప్టెన్‌ భావిస్తున్నారు.


అందుకే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అక్షర్‌ను ఐదో నెంబర్‌లో ఆడించారు. అయితే అతను సక్సెస్‌ అవుతున్నప్పటికీ.. రాహుల్‌ ఫామ్‌ కోల్పోతుండడం జట్టుకు ఏవిధంగా మేలు చేస్తుందనే విషయం కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ‘ఒకవేళ బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన పిచ్‌పై జట్టు 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పుడు అక్షర్‌ను ఆడించే ధైర్యం చేయగలరా? అలాకాని పక్షంలో ఈ మతిలేని ప్రయోగం ఎందుకు?’ అని మాజీ పేసర్‌ దొడ్డ గణేష్‌ సూటిగా ప్రశ్నించాడు.

పంత్‌ పరిస్థితేమిటి?

రాబోయే చాంపియన్స్‌ ట్రోఫీలోనూ జట్టు లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌తోనే వెళ్లనున్నట్టు స్పష్టమవుతోంది. దీన్ని బట్టి కేఎల్‌ రాహుల్‌ ఆరో స్థానానికే ఫిక్స్‌ అవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తుది జట్టులో చోటు లేక బెంచీకే పరిమితమైన రిషభ్‌ పంత్‌ పరిస్థితేమిటన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న బ్యాటింగ్‌ కాంబినేషన్‌లో అతడికి జట్టులో చోటు కష్టమని మాజీ బ్యాటర్‌ ఒకరు తేల్చాడు. వ్యాఖ్యాత రవిశాస్త్రి కూడా ‘జట్టు కూర్పు గురించి ఓసారి ఆలోచించాలి. పంత్‌లాంటి ఆటగాడిని బెంచీపై కూర్చోపెడితే ఎలా’ అని ప్రశ్నించాడు. 2022 రోడ్డు ప్రమాదం తర్వాత పంత్‌ ఒక్క వన్డే మాత్రమే ఆడి ఆరు పరుగులు చేశాడు. అందుకే జట్టు కీపర్‌గా తొలి ప్రాధాన్యత అనుభవజ్ఞుడైన రాహుల్‌కే ఇస్తున్నారు. అటు రాహుల్‌ తనకు సరిపోని స్థానంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇదిలాగే కొనసాగితే కేఎల్‌ను పక్కకు తప్పించి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చే పంత్‌ను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఒత్తిడిలో రాహుల్‌ ప్రదర్శన ఎలా ఉంటుందో మున్ముందు చూడాల్సిందే.


ఫ్లడ్‌లైట్స్‌ ఎందుకు ఆగాయి?

ఒడిశా ప్రభుత్వం సీరియస్‌

కటక్‌: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్‌లైట్లు ఆగిపోవడంపై ఒడిశా ప్రభుత్వం చర్యలకు దిగింది. భారత్‌ ఇన్నింగ్స్‌ 6.1 ఓవర్లప్పుడు 35 నిమిషాలసేపు ఓ ఫ్లడ్‌లైట్‌ టవర్‌ మొరాయించడంతో ఆటగాళ్లంతా మైదానం వీడాల్సి వచ్చింది. ఈ ఇబ్బందికర పరిస్థితిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఒడిశా క్రికెట్‌ సంఘానికి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఆరేళ్ల తర్వాత ఇక్కడ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజా వైఫల్యంతో ఇక్కడ మ్యాచ్‌ నిర్వహణకు బీసీసీఐ ముందుకు వస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు జనరేటర్‌లో సమస్య కారణంగా ఓ టవర్‌ లైట్లలో సమస్య వచ్చిందని, మరో జనరేటర్‌ తెచ్చి దాన్ని పరిష్కరించినట్టు ఓ అధికారి తెలిపాడు.


ఇవీ చదవండి:

డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే

ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌‌పై పగబట్టారా..

ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌‌మ్యాన్ తాండవం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2025 | 04:33 AM