పద్మాకర్ శివాల్కర్ మృతి
ABN, Publish Date - Mar 04 , 2025 | 02:45 AM
ముంబై జట్టు దిగ్గజ క్రికెటర్ పద్మాకర్ శివాల్కర్ (84) సోమవారం మృతి చెందాడు. 21 ఏళ్ల వయస్సులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ (1961)లో అడుగుపెట్టిన తను 47 ఏళ్ల వయస్సు వరకు....
ముంబై: ముంబై జట్టు దిగ్గజ క్రికెటర్ పద్మాకర్ శివాల్కర్ (84) సోమవారం మృతి చెందాడు. 21 ఏళ్ల వయస్సులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ (1961)లో అడుగుపెట్టిన తను 47 ఏళ్ల వయస్సు వరకు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే లెఫ్టామ్ స్పిన్నర్ అయిన పద్మాకర్ భారత క్రికెట్ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. ఆ సమయంలో బిషన్ సింగ్ బేడీ నుంచి తనకు గట్టి పోటీ ఎదురైంది. కెరీర్‌లో 124 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 589 వికెట్లు పడగొట్టాడు. అతడి మృతిపై గవాస్కర్ సంతాపం వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 04 , 2025 | 02:45 AM