యువ భారత్‌ను ఆపతరమా?
ABN, Publish Date - Feb 02 , 2025 | 02:56 AM
ప్రత్యర్థులపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఇక..ఈ పోరు గెలిస్తే రెండోసారి విశ్వవిజేతగా నిలుస్తుంది. ఇదీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో...
దక్షిణాఫ్రికాతో ఫైనల్ నేడు
అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్
మ. 12 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
కౌలాలంపూర్: ప్రత్యర్థులపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఇక..ఈ పోరు గెలిస్తే రెండోసారి విశ్వవిజేతగా నిలుస్తుంది. ఇదీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆటతీరు. అజేయంగా టైటిల్ పోరుకు దూసుకొచ్చిన నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత అమ్మాయిలు ఆదివారం సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనున్నారు. టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు భారత్ ప్రదర్శన చూస్తే..టైటిల్ పోరులో మనోళ్లనే తిరుగులేని ఫేవరెట్‌గా అంచనా వేస్తున్నారు. ఫైనల్ వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అన్ని విభాగాల్లో భారత్ దుమ్ము రేపింది. వెస్టిండీ్‌సపై 9 వికెట్లతో, మలేసియాపై 10 వికెట్లతో, శ్రీలంకపై 60 పరుగులతో, బంగ్లాదేశ్‌పై 8 వికెట్లతో, స్కాట్లాండ్‌పై 150 రన్స్‌తో, సెమీ్‌సలో ఇంగ్లండ్‌పై 9 వికెట్లతో విజయం సాధించడం మన అమ్మాయిలు ఏస్థాయిలో చెలరేగారో అర్థమవుతుంది.
తెలుగమ్మాయి గొంగడి త్రిష బ్యాటింగ్‌లో అదరగొడుతోంది. ఆరు ఇన్నింగ్స్‌లో 66.25 సగటుతో 265 పరుగులు చేసింది. తద్వారా టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచింది. త్రిష ఓపెనింగ్ భాగస్వామి, కీపర్ కమిలిని ఆరు ఇన్నింగ్స్‌లో 45 సగటుతో 135 రన్స్ చేసింది. టోర్నీలో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కొనసాగుతోంది. ఫైనల్లోనూ వారిద్దరి జోరు కొనసాగితే మనోళ్లకు తిరుగుండబోదు. బౌలింగ్ విభాగంలో.. ముఖ్యంగా స్పిన్ ద్వయం వైష్ణవి, ఆయుషి ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచారు. వైష్ణవి 15, ఆయుషి 12 వికెట్లతో టోర్నీలో టాప్-2 బౌలర్లుగా నిలిచారు. టైటిల్ ఫైట్‌లోనూ వీరిద్దరూ కీలకం కానున్నారు. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఒక్క పరాజయమూ లేకుండా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాలని తలుస్తోంది.
ఇవీ చదవండి:
ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. భారత్ పుట్టి ముంచిన కుర్ర పేసర్
టీమిండియాకు బ్యాడ్ లక్.. టాస్‌లో ఇలా జరిగిందేంటి
కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 02 , 2025 | 02:56 AM