ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: మహా కుంభమేళాలో గ్రీకు ప్రియురాలిని పెళ్లాడిన భారతీయుడు..

ABN, Publish Date - Jan 28 , 2025 | 10:52 AM

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వైభవంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా.. మహా కుంభమేళాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. తాజాగా...

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు భారతదేశం నుంచే కాక ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా.. మహా కుంభమేళాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలే తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా.. మహా కుంభమేళాలో ఒక భారతీయ వ్యక్తి తన గ్రీకు ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఘటన నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


సిద్ధార్థ్ అనే వ్యక్తి గ్రీస్‌కు చెందిన పెనెలోప్‌ను మహా కుంభమేళాలో సాంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వివాహం అనేది ఒక పవిత్రమైనదని, పురాతన సంప్రదాయాన్ని అనుసరించడం అనేది చాలా ముఖ్యమని.. అందుకే ఎంతో పవిత్రమైన ఈ మహా కుంభమేళాలో వేద పండితుల మధ్య పెళ్లి చేసుకున్నానని సిద్ధార్థ్ తెలిపాడు. తన ప్రియురాలు పెనెలోప్‌కు ప్రపోజ్ చేసినప్పుడు, భారతదేశంలో లేదా గ్రీస్‌లో పెళ్లి చేసుకునే అవకాశాన్ని ఇచ్చానని, అయితే, ఆమె భారతదేశాన్ని ఎంచుకుంది అని వెల్లడించాడు.


మహా కుంభమేళాలో తన వివాహిం జరగడం మాటలకు మించిన అద్భుతం అని సిద్ధార్థ్ ప్రియురాలు పెనెలోప్ అభివర్ణించింది. తాను భారతీయ వివాహానికి ఎన్నడూ హాజరుకాలేదని, వధువును నేనే కాబట్టి అన్నీ కొత్తగా ఉన్నాయని, తన పెళ్లి ఇంత ఆధ్యాత్మికంగా, ఈ పవిత్రమైన స్థలంలో జరగడం చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపింది. వీరి ఇద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కంగ్రాట్యులేషన్స్ అంటూ కొందరు, సూపర్ జోడి అంటూ మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: మీ పేరు S అక్షరంతో మొదలవుతుందా.. మీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే..

Updated Date - Jan 28 , 2025 | 11:23 AM