భారతీయ నర్సులను స్వదేశానికి చేర్చడంలో తెలుగు ఎన్నారైల చొరవ
ABN, Publish Date - Feb 25 , 2025 | 12:25 PM
వివిధ కారణంలో గల్ఫ్‌లో చిక్కుకుపోయి స్వదేశానికి తిరిగి రాలేకపోతున్న భారతీయ నర్సులకు అక్కడి ఎన్నారైలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వారు స్వదేశానికి భద్రంగా తిరిగెళ్లేందుకు సాయపడుతున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వచ్చి వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కునే తెలుగు మహిళలలో వృత్తి పరమైన విద్యాధికులైన మహిళలు కూడా ఉంటారు. ప్రత్యేకించి నర్సింగ్ వృత్తిలో ఉన్న మహిళలు అనేకులు గల్ఫ్‌కు వచ్చాక ఇబ్బందులకు గురవుతున్నారు (NRI).
అప్పులు చేసి వచ్చే వీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి అవసరమైన అర్హత ప్రవేశ పరిక్షలో ఉత్తీర్ణులు కాకపోవడంతో ఇక్కడ ఉద్యోగం చేసే వీలు లేక అలాగని సులువుగా స్వదేశానికి తిరిగి వెళ్ళలేక మానసిక క్షోభకు గురవుతారు. ఈ అగమ్యగోచరమైన స్ధితిలోని మహిళలకు ఏ రకమైన చిన్న సహాయమైనా చాలా పెద్దది.
నర్సింగ్ వృత్తిలో నైపుణ్యత కల్గిన మహిళలు అనేక మంది అధిక వేతనాల కారణంగా సౌదీలో పని చేయడానికి ఇష్టపడి వస్తారు. వైద్య, ఆరోగ్య నిపుణులకు సంబంధిత అధికార మండళ్ళు నిర్వహించే నైపుణ్యత పరీక్షలో ఉత్తీర్ణులైతే మాత్రమే వారు ఉద్యోగం చేయడానికి వీలుంటుంది. ఒక వేళ పరిక్షలో ఫెయిలైతే మాత్రం స్వదేశానికి తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది.
Singapore: శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతంపై ప్రసంగాలు
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే నర్సులలో కొందరు ఈ పరిక్షలు ఉత్తీర్ణులవుతుండగా మరికొందరు ఫెయిలై దిక్కుతోచని దుస్థితిని ఎదుర్కుంటున్నారు. వీరికి రియాద్‌లోని తెలుగు ప్రవాసీయులు బాసటగా నిలుస్తూ స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి సహకరిస్తున్నారు.
తాజాగా కడప జిల్లా కేంద్రానికి చెందిన ఒక యస్.యస్ అనే 33 ఏళ్ళ యువతి.. నర్సు ఉద్యోగం కోసం రెండున్నర లక్షల రూపాయాలు ఏజంటుకు చెల్లించి రియాధ్ నగరానికి వచ్చింది. పరీక్షలో ఫెయిలవడంతో ఏజంటు తన భాద్యత కాదంటూ చేతులెత్తెశాడు.
THKTS: హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
దీంతో అమె స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి కూడా ఇబ్బందులను ఎదుర్కోని అనేక చోట్ల సహాయం కోసం అర్థించింది. రియాద్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్‌ను సంప్రదించడంతో సంఘం ప్రతినిధులు దుగ్గరపు ఎర్రన్న, ఉషా, రంజీత్, నరేంద్ర, ముజ్జమ్మీల్‌లు ఆమె వచ్చిన కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వీసాను రద్దు చేయించడంతో పాటు విమాన టిక్కెట్ సమకూర్చడంతో సదరు మహిళ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయింది. ఈ రకమైన మహిళల కోసం తాము ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ఉష తెలిపారు.
అంతకు ముందు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక యువతి అల్ హస్సా అనే ప్రాంతంలోని ఒక మానసిక వైద్యశాలలో నర్సుగా పని చేయడానికి వచ్చి ఇదే రకమైన పరిస్ధితులలో ఇరుక్కోపోయారు. 415 కిలో మీటర్ల దూరం నుండి రియాధ్‌కు రాగా సాటా సెంట్రల్ ప్రతినిధి జానీ బాషా అమెకు ఆశ్రయం కల్పించి ఇతర సభ్యుల సహాయంతో స్వదేశానికి తిరిగి స్వదేశానికి పంపించారు.
Updated Date - Feb 25 , 2025 | 12:49 PM