ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Varaha Dwadashi : చివరి పరీక్షను ఇలా గెలుద్దాం!

ABN, Publish Date - Feb 06 , 2025 | 10:57 PM

జీవితంలోని ఆఖరి క్షణంలో చేసే ఆలోచన చివరి పరీక్షలాంటిది. ఈ చివరి పరీక్షకు జీవితాంతం సిద్ధం కావాలి. జీవితమంతా ఆ భగవతుణ్ణి స్మరించే సాధన చేయగలిగితే... మన ఆఖరి క్షణాల్లో రాసే ఆ చిట్ట చివరి పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణులం అవుతాం.

9న వరాహ ద్వాదశి

జీవితంలోని ఆఖరి క్షణంలో చేసే ఆలోచన చివరి పరీక్షలాంటిది. ఈ చివరి పరీక్షకు జీవితాంతం సిద్ధం కావాలి. జీవితమంతా ఆ భగవతుణ్ణి స్మరించే సాధన చేయగలిగితే... మన ఆఖరి క్షణాల్లో రాసే ఆ చిట్ట చివరి పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణులం అవుతాం.

మనమందరం మన రోజువారీ జీవితాలలో తీరిక లేకుండా గడిపేస్తున్నాం. మనుగడకోసం చేసే ఈ పోరాటంలో మనం ఎన్నో కష్ట సుఖాలను ఎదుర్కొంటూ ఉంటాం. మన రోజువారీ విధులను నిర్వర్తిస్తూనే... భగవంతుడికి చేరువయ్యే మార్గాన్ని ‘భగవద్గీత’ బోధించింది. అదే విధంగా మనకు ఎన్నో పండుగలు, విశేషమైన ఉత్సవాలు ఉన్నాయి. వాటిని జరుపుకోవడం ద్వారా భగవన్నామస్మరణను మరింత ఎక్కువగా చేసుకోవచ్చు. భగవంతుణ్ణి, ఆయన దివ్య లీలల్లోని అంతరార్థాన్నీ పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవారు మోక్షాన్ని పొందుతారని, భగవత్‌ సన్నిధానాన్ని చేరుకుంటారనీ పెద్దలు చెప్పారు. అటువంటి ఒక అవకాశమే శ్రీ వరాహ ద్వాదశి. ఇది శ్రీ వరాహస్వామిగా మహా విష్ణువు అవతరించిన రోజు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

For National News And Telugu News


వరాహస్వామి వాగ్దానం

శ్రీ వరాహావతార లీలను ప్రపంచవ్యాప్త హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యుడైన శ్రీల ప్రభుపాదులు వివరిస్తూ... ‘‘సృష్టి ఆరంభం నుంచి దేవతలు, దైత్యులు అనే ఇరు వర్గాల వారు విశ్వంలోని లోకాలన్నిటినీ శాసించేవారు. భగవంతుడు ఏర్పరచిన ఈ సృష్టిలో నిర్దిష్ట నియమానుసారం... గ్రహాలన్నీ అంతరిక్షంలో తేలియాడుతూ ఉండేవి. వాటిలో కొన్ని జలాలతో నిండి ఉండగా, మిగిలిన సగం అసంఖ్యాకమైన గ్రహాలతో కూడిన లోకాలతో నిండి ఉండేది. ఈ గ్రహాలు కక్ష్యలో తిరిగే క్రమానికి అసురుడైన హిరణ్యాక్షుడు విఘాతం కలిగించాడు. దీనితో భూలోకం తన భారరహిత స్థితిని కోల్పోయి జలాలలోకి జారిపోయింది. ఆ సమయంలో... ఈ జగత్తుకు స్థితికారకుడైన మహా విష్ణువు... భీకరమైన సూకర రూపాన్ని ధరించి, తన దంతాలతో భూమండలాన్ని జలాల నుంచి పైకి ఎత్తి పట్టాడు. ఆ సందర్భంలో వరాహస్వామిని హిరణ్యాక్షుడు అడ్డగించబోగా... స్వామి తన దంతాలతో అతణ్ణి గుచ్చి సంహరించాడు. భగవంతుడి అవతారాలకు ఉన్న విశిష్టత ఇదే. అసాధారణమైన పరిస్థితుల్లోనే ఆయన అవతరిస్తాడు. మనుష్యుడి ఆలోచనకైనా అందని పరమాద్భుతమైన రీతిలో తన లీలలను ప్రదర్శిస్తాడు. అటువంటి భగవంతుణ్ణి సదా స్మరించుకోవడమే ముక్తికి మార్గం అని పురాణాలు చెబుతున్నాయి. మరి మేము ప్రతిరోజూ భగవన్నామ స్మరణ చేస్తున్నాం. కానీ జీవితంలోని ఆఖరి క్షణంలో దేవుణ్ణి స్మరించుకోలేని ప్రమాదకర పరిస్థితిలో ఉంటే ఎలా? అని కొందరు భక్తులకు సందేహం కలుగవచ్చు. ‘‘ఒకవేళ నా భక్తుడు మరణ సమయంలో దేహానికి కలిగే అవాంతరాల కారణంగా నన్ను స్మరించలేకపోతే... నేనే నా భక్తుణ్ణి స్మరించి, నా దివ్య ధామానికి తీసుకువెళ్తాను’’ అని ‘వరాహ పురాణం’లో శ్రీవరాహస్వామి చేసిన వాగ్దానం... ఆ సందేహానికి సమాధానం ఇస్తుంది. వరాహ ద్వాదశి రోజున... వరాహమూర్తిని స్మరించాలి. హరేకృష్ణ మంత్రాన్ని జపించాలి. అన్నదానం, గోసేవలను నిర్వహించడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది.

శాశ్వతమైన ఆనందం కోసం...

జీవితంలోని చిట్టచివరి క్షణంలో చేసే భగవన్నామ స్మరణ గురించి శ్రీకృష్ణుడు వివరించాడు. ‘‘ఏ వ్యక్తి తన చిట్ట చివరి క్షణంలో దేనినైతే తలుస్తాడో, దాని ఆధారంగానే ఆ వ్యక్తి తదుపరి జన్మ నిర్ణయం అవుతుంది. దేవతలను తలిస్తే దేవ లోకాన్ని చేరుతారు. తమ పూర్వీకులను తలిస్తే పితృలోకాలకు చేరుకుంటారు. శ్రీహరిని లేదా నారాయణుణ్ణి లేదా శ్రీకృష్ణుణ్ణి తలచుకుంటే... ఆ దేవాదిదేవుడి దివ్య ధామాన్ని తప్పకుండా చేరుకుంటారు’’ అని చెప్పాడు. భగవద్ధామం ఒక్కటే శాశ్వతమనీ, భౌతిక ప్రపంచంలోని మిగిలినవన్నీ తాత్కాలికమేననీ భగవద్గీత వివరిస్తోంది. శాశ్వతమైన ఆనందాన్ని పొందాలన్నదే అందరి ఆకాంక్ష. అయితే అది భగవద్ధామాన్ని చేరినప్పుడు మాత్రమే నెరవేరుతుంది. జీవితంలోని ఆఖరి క్షణంలో చేసే ఆలోచన చివరి పరీక్షలాంటిది. ఈ చివరి పరీక్షకు జీవితాంతం సిద్ధం కావాలి. జీవితమంతా ఆ భగవతుణ్ణి స్మరించే సాధన చేయగలిగితే... మన ఆఖరి క్షణాల్లో రాసే ఆ చిట్ట చివరి పరీక్షలో తప్పకుండా ఉత్తీర్ణులం అవుతాం.

శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

Updated Date - Feb 06 , 2025 | 10:57 PM