యూపీఎస్సీ సివిల్స్ కొత్త మార్పులతో నోటిఫికేషన్
ABN, Publish Date - Jan 27 , 2025 | 03:56 AM
జనవరి 22న, ‘‘979 పోస్టులతో’’ ్ఖ్కఖిఇ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్-2025 వెలువడింది. గత ఏడాది (2024లో) వెయ్యికి పైగా ఖాళీలతో, అంతకుముందు...
జనవరి 22న, ‘‘979 పోస్టులతో’’ ్ఖ్కఖిఇ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్-2025 వెలువడింది. గత ఏడాది (2024లో) వెయ్యికి పైగా ఖాళీలతో, అంతకుముందు సంవత్సరం(2023లో) 1100లకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది.
అయితే మొత్తం భర్తీ చేసే సర్వీసులను ఈసారి 23కు పెంచడం జరిగింది(గత ఏడాది 21 సర్వీసులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది). ఈసారి ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఖకఖి)ను విభజించి, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ - ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ - ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్‌లుగా చేయడంతో ఈసారి భర్తీ చేసే సర్వీస్‌ల సంఖ్య 23కు పెరిగింది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ల స్వీకరణ : 2025 జనవరి 22
చివరి తేదీ: 2025 ఫిబ్రవరి 12 (సాయంత్రం 6 గంటల వరకు)
ప్రిలిమినరీ పరీక్ష : 2025 మే 25
హాల్ టిక్కెట్స్ విడుదల: 2025 ఏప్రిల్
మెయిన్స్ పరీక్ష ప్రారంభం: 2025 ఆగస్టు 22
మెయిన్స్ ఫలితాల ప్రకటన: తరవాత వెల్లడిస్తారు.
వయోపరిమితి:
జనరల్ అభ్యర్థులకు: వయస్సు 21-32 సంవత్సరాల మధ్య ఉండాలి. (2 ఆగస్టు 1993 - 1 ఆగస్టు 2004 మధ్య జన్మించి ఉండాలి)
OBC: గరిష్ట వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపు
SC & ST: గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు
డిఫెన్సు సర్వీస్‌లో అంగవికలురైన వారికి: గరిష్ట వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపు
ఎక్స్-సర్వీస్‌మన్: గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు
PwD: బెంచ్ మార్క్ డిజెబిలిటీ కలిగివున్న వారికి గరిష్ట వయోపరిమితిలో 10 ఏళ్ల వరకు సడలింపు.
గమనిక: డిఫెన్సు సర్వీ్‌సలో అంగవికలురయినవారికి, ఎక్స్-సర్వీ్‌సమన్‌కి, ్కఠీఈ వారికి తమ కులాల ప్రాతిపాదికన లభించే వయోపరిమితి సడలింపు కూడా కలిపి వర్తిస్తుంది. అనగా ఒక వ్యక్తి ్కఠీఈ, ఖిఇ/ఖిఖీ సామాజికవర్గ మినహాయింపును కలిపి పొందినట్లైతే గరిష్టంగా 47 ఏళ్లు గరిష్ట వయోపరిమితి సడలింపు పొందగలరు.
అటెంప్ట్‌ల సంఖ్య :
జనరల్ అభ్యర్థులకు: 6
OBC: 9
SC & ST: పరిమితిలేదు
ఫీజు: జనరల్ అభ్యర్థులకు 100 రూపాయలు. మహిళలు, ఇతర అన్ని కేటగిరి అభ్యర్థులందరికీ ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఈ సంవత్సరం వచ్చిన మార్పులు
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు కనీస విద్యార్హతలైన గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు హాజరుకావచ్చు. గతంలో కేవలం ప్రిలిమినరీకి మాత్రమే ఈ అవకాశం ఉండేది, మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాలంటే మాత్రం గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రస్తుతం ఇంటర్వ్యూకి ముందు నిర్ధేశిత గడువులోగా ఉత్తీర్ణతా సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుంది.
రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపులు కోరుతున్న అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ప్రిలిమినరీ అప్లికేషన్‌లోనే సమర్పించాల్సివుంది. గతంలో ఈ నియమం ప్రిలిమ్స్ దశలో లేదు.
ఆదేవిధంగా ౖఆఇలు కుల ధృవీకరణ పత్రంతో పాటుగా, నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్‌ను కూడా దాఖలు చేయాలి. నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ గడచిన మూడు ఆర్థిక సంవత్సరాలకు(అనగా 2021-22, 2022-23, 2023-24కు) సంబంధించినదై ఉండాలి. ౖఆఇ సర్టిఫికెట్ 01-04- 2024, 11-02-2025 మధ్య జారీ అయినదై వుండాలి.
ఉగిఖి రిజర్వేషన్‌కు అర్హులైనవారు కూడా, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, నిర్ణీత అధికారితో 01-04-2024, 11-02-2025 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ క్రయిటీరియా ప్రకారం జారీ చేసిన ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్‌ను ప్రిలిమినరీ అప్లికేషన్ దశలోనే సమర్పించాలి.
ఈసారి ‘‘సర్వీస్ ప్రిఫరెన్స్’’లను కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్లికేషన్‌లోనే ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ‘‘క్యాడర్ ప్రిఫరెన్స్’’లను ప్రిలిమ్స్ పరీక్ష అయిన 10 రోజుల తరువాత సమర్పించాలి.
పరీక్షలకు వన్ టైమ్ రిజిస్ర్టేషన్ అనేది తప్పనిసరి. తొలిసారిగా పరీక్షకు హాజరయ్యేవారు ముందుగా ్ఖ్కఖిఇ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ర్టేషన్‌ను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వన్ టైమ్ రిజిస్ర్టేషన్లో సమర్పించిన వివరాలను (డేట్ ఆఫ్ బర్త్ మినహా), సమర్పించిన తేదీ నుంచి - 18 ఫిబ్రవరి 2025లోపుగా ఎప్పుడైనా సవరించుకొనే వీలుంటుంది.
ప్రిలిమినరీ అప్లికేషన్‌లో సమర్పించిన ఏదైనా వివరాలను సవరించాలనుకొంటే, 2025 ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18లోగా సరిచేసుకోవచ్చు.
అడ్రసు, ఉన్నత విద్యార్హతలకు సంబంధించి, లేదా సర్వీ్‌స/కేడర్‌ల ఎంపికకు సంబంధించి మార్పు చేర్పులు చేసుకోవడానికి మెయిన్స్ పరీక్షల తరువాత 15 రోజుల గడువు ఉంటుంది. అయితే అభ్యర్థులు ముందస్తుగానే జాగ్రత్తగా అప్లికేషన్‌ను నింపడం మంచిది.
అభ్యర్థి రూపం దరఖాస్తుతో సమర్పించే ఫోటోలో ఉన్న విధంగానే పరీక్ష, ఇంటర్వ్యూ సమయంలో కూడా ఉండాలి.
ఉదా: హెయిర్ స్టయిల్, గడ్డం, కళ్ళజోడు మొదలైనవి. అప్లికేషన్ ప్రారంభ తేదీకి పది రోజులకంటే ముందు తీయించుకొన్న ఫోటోలను సమర్పించరాదు. అనగా 12 జనవరి 2025 కంటే ముందు తీయించుకొన్న ఫొటోలను అంగీకరించరు. ఫొటో కింది భాగంలో అభ్యర్థి పేరు, ఫోటో తీసిన తేదీని విధిగా పేర్కొనాలి.
గమనిక: చివరితేదీ వరకు దరఖాస్తు దాఖలు చేయకుండా తాత్సారం చేయవద్దు. ఒక్కోసారి చివరి రోజుల్లో సర్వర్ ఇబ్బందులు వస్తే కష్టం అవుతుంది.
ఎం. బాలలత
సివిల్స్ మెంటార్
ఇవి కూడా చదవండి
Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 27 , 2025 | 03:56 AM